HomeUncategorizedఅనుమానం వస్తే కాల్ చెయ్యండి - కమీషనర్ శ్రీనివాస్

అనుమానం వస్తే కాల్ చెయ్యండి – కమీషనర్ శ్రీనివాస్

PALASA MUNCIPALITY : ఇళ్ల వద్దకు వచ్చే ఎన్యుమరేటర్లకు సరైన సమాచారం అందించి వారికి సహకరించాలని కోరారు

అనుమానం వస్తే కాల్ చెయ్యండి.

2027 జనాభా లెక్కల్లో భాగంగా ఇళ్ల జాబితా,ఇండ్ల గణన కార్యక్రమం శ్రీకాకుళం జిల్లా పలాస లో ప్రారంభమైంది.మే1నుండి ప్రారంభమై ఈ నెల 31 వరకు కొనసాగనున్న ఇండ్ల గణన కార్యక్రమం కోసం సెన్సస్ ఎన్యుమరేటర్లు తమ శిక్షణ పూర్తిచేసుకుని పలాస కాశీబుగ్గ జంటపట్టణాల్లో ఇండ్ల గణన కార్యక్రమంలో బిజీ బిజీగా ఉన్నారు.

ఈసందర్భంగా పలాస కాశీబుగ్గ మునిసిపల్ కమీషనర్ శ్రీనివాస్ మాట్లాడుతూ….ఇండ్ల గణన అనే కార్యక్రమం ముఖ్యఉద్దేశం ప్రజల ఆర్ధిక స్టితిగతులు తెలుసుకుని దేశ ప్రణాళిక,అభివృద్ధి కి తోడ్పాటును అందించడమే కేంద్రప్రభుత్వ ఉద్దేశమని తెలిపారు.

ఇళ్ల వద్దకు వచ్చే ఎన్యుమరేటర్లకు సరైన సమాచారం అందించి వారికి సహకరించాలని కోరారు

పట్టణంలో 103 మంది ఎన్యుమరేటర్లు ఇండ్ల గణన కార్యక్రమంలో ఉన్నారని,వారంతా స్థానిక వార్డ్ సచివాలయ సిబ్బందేనని,ప్రజలిచ్చే సమాచారం గోప్యంగా ఉంచబడుతుందన్నారు.ఆపరిచిత వ్యక్తులుగా భావిస్తే తమకు నేరుగా ఫోన్ ద్వారా సంప్రదించి సమాచారమందించాలని కమీషనర్ శ్రీనివాస్ కోరారు

RELATED ARTICLES

Most Popular