HomeUncategorizedసీఎం సహాయ నిధితో పేద కుటుంబానికి ఊరట.

సీఎం సహాయ నిధితో పేద కుటుంబానికి ఊరట.

సీఎం రిలీఫ్ ఫండ్ (సీఎంఆర్ఎఫ్) కింద మంజూరైన రూ.1,15,000 చెక్కును ఇచ్ఛాపురం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బెందాళం అశోక్ బాబు గురువారం అందజేశారు.

సీఎం సహాయ నిధితో పేద కుటుంబానికి ఊరట.

అనారోగ్యంతో చికిత్స ఖర్చులు భరించలేక ఇబ్బందులు పడుతున్న కంచిలి మండలం మండపల్లి గ్రామానికి చెందిన గార కాళీ వరప్రసాద్ కుటుంబానికి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆర్థిక ఊరట లభించింది. సీఎం రిలీఫ్ ఫండ్ (సీఎంఆర్ఎఫ్) కింద మంజూరైన రూ.1,15,000 చెక్కును ఇచ్ఛాపురం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బెందాళం అశోక్ బాబు గురువారం అందజేశారు.

కవిటి మండలం రామయ్యపుట్టుగలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో కూటమి నాయకులు, ప్రజాప్రతినిధుల సమక్షంలో లబ్ధిదారుడికి చెక్కును అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేద కుటుంబాలు వైద్య ఖర్చులతో ఆర్థికంగా కుంగిపోకుండా ఆదుకోవడమే సీఎం సహాయ నిధి ప్రధాన ఉద్దేశమన్నారు. అవసర సమయంలో ప్రభుత్వం అండగా నిలవడం వల్ల ఎన్నో కుటుంబాలకు భరోసా కలుగుతోందని తెలిపారు.

ప్రజల కష్టసుఖాల్లో ప్రభుత్వం భాగస్వామి కావాలనే సంకల్పంతో సీఎం సహాయ నిధి ద్వారా వేగంగా సాయం అందిస్తున్నామని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు చేరేలా కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే పేర్కొన్నారు.  ఈ కార్యక్రమంలో దిక్కల దామోధరం, దిక్కల గోపి తదితర కూటమి నాయకులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular