నారీశక్తి కార్యక్రమాలతో శభాష్ ఆనిపించుకుంటున్న కాశీబుగ్గ పోలీసులు
శ్రీకాకుళం జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి ఆదేశాలమేరకు కాశీబుగ్గ పోలీసులు పలాస మండలంలో గల పలు గ్రామాల్లో విరివిగా నారీశక్తి కార్యక్రమాలను నిర్వహిస్తూ కొత్త చట్టాల గురించి ప్రజలకు వివరించడంతోపాటు,రాబోవు స్థానిక ఎన్నికల దృష్ట్యా అవగాహన కల్పిస్తున్నారు.
బుధవారం నాడు పలాస మండలం కోసంగిపురం గ్రామ కూడలి వద్ద గ్రామస్తులతో సమావేశమైన కాశీబుగ్గ పోలీస్ స్టేషన యెస్.ఐ ఆర్.నరసింహమూర్తి తన సిబ్బందితో కలసి నారీశక్తి కార్యక్రమాన్ని నిర్వహించారు.

సైబర్ నేరాలు,ఆన్లైన్ మోసాలు పట్ల అప్రమత్తంగా ఉండాలని హితవుపలికారు. బాల్యవివాహాలు,మహిళలపై జరుగు నేరలపై 112 కు కాల్ చెయ్యాలని కోరారు.
బెట్టింగులు,పేకాట,గంజాయి వినియోగం,అమ్మకాలు చట్టరీత్య నేరమని యువత వీటికి దూరంగా ఉండాలని అన్నారు.
పండగలు ఉత్సవాలు సమయాల్లో ముందుగా పోలీస్ స్టేషన్ కు తెలియజేయాలన్నారు.
గ్రామాల్లో ఉన్న దేవాలయాలు,మసీదులకు తప్పనిసరిగా సిసి కెమేరాలు అమార్చాలని పేర్కొన్నారు.
