HomeUncategorizedమహిళ భద్రతపై పని ప్రదేశాల్లో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు: జిల్లా షీ టీమ్

మహిళ భద్రతపై పని ప్రదేశాల్లో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు: జిల్లా షీ టీమ్

RAJANNA SIRISILLA : మహిళలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నా నిర్భయంగా ఫిర్యాదు చేయాలి

మహిళలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నా నిర్భయంగా ఫిర్యాదు చేయాలి.

మహిళ భద్రతపై పని ప్రదేశాల్లో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు: జిల్లా షీ టీమ్.

జిల్లాలో మహిళల భద్రతను బలోపేతం చేయడం లక్ష్యంగా జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే గారి ఆదేశాల మేరకు జిల్లా షీ టీమ్ ఆధ్వర్యంలో మహిళలు పని చేసే ప్రదేశాల్లో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తుంది.

ఈకార్యక్రమల్లో మహిళలపై జరిగే లైంగిక వేధింపుల నివారణ,పని ప్రదేశాల్లో మహిళల భద్రతా చర్యలు,మహిళ చట్టాలపై సమగ్రంగా అవగాహన కల్పిస్తున్నారు.

ఈసందర్భంగా ఈరోజు తంగలపల్లి మండల పరిధిలోని తడూర్, గోపాల్రావుపల్లి, లక్ష్మీపూర్, గ్రామాల్లో ఉపాధి హామీ పనికి వెళ్లే మహిళకు అవగాహన కల్పించి,వేధింపులకు గురైతే నిర్భయంగా షీ టీమ్ నెంబర్ 87126 56425 కు ఫిర్యాదు చేయాలని,నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని,ఫిర్యాదుదారుల వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచబడతాయని షీ టీమ్అధికారులు సూచించారు.సోషల్ మీడియాలో అపరిచిత వ్యక్తులకు స్పందించకూడదని,గుర్తు తెలియని వ్యక్తులతో వ్యక్తిగత సమాచారం పంచుకోవొద్దని తెలిపారు.

ఏప్రిల్ నెలలో జిల్లాలో వేధింపులకు పాల్పడిన వారిపై 04 FIR’s, 02 పెట్టి కేసులు నమోదు చేసి వారి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సెలింగ్ నిర్వహించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో షీ టీమ్ ఏఎస్‌ఐలు ప్రమీల,రవి , సిబ్బంది శ్రీలత, శ్రీనివాస్‌తో పాటు పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు

RELATED ARTICLES

Most Popular