Homeఎడ్యుకేషన్జడ్పీ.హెచ్‌.ఎస్. విద్యార్థినికి దుశ్శాలువతో సత్కారం.

జడ్పీ.హెచ్‌.ఎస్. విద్యార్థినికి దుశ్శాలువతో సత్కారం.

KANCHILI : పదిలో మండల ఫస్ట్ సాధించిన హాసినికి యూటీఎఫ్ ఘన సన్మానం

పదిలో మండల ఫస్ట్ సాధించిన హాసినికి యూటీఎఫ్ ఘన సన్మానం

589 మార్కులతో కంచిలి మండలంలో ప్రథమ స్థానం.

జడ్పీహెచ్‌ఎస్ బూరగాం విద్యార్థినికి దుశ్శాలువతో సత్కారం.

2025-26 ఎస్ఎస్సీ ఫలితాల్లో 589 మార్కులు సాధించి కంచిలి మండలంలోనే ప్రథమ స్థానంలో నిలిచిన జడ్పీహెచ్‌ఎస్ బూరగాం విద్యార్థిని సింహాద్రి హాసినిని కంచిలి మండల యూటీఎఫ్ శాఖ ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా సన్మానించారు. హాసిని నివాసానికి వెళ్లిన యూటీఎఫ్ నాయకులు ఆమెను దుశ్శాలువతో సత్కరించి, జ్ఞాపిక అందజేశారు. విద్యార్థిని సాధించిన ప్రతిభను ప్రశంసిస్తూ భవిష్యత్తులో ఇంకా ఉన్నత స్థాయిలను అధిరోహించాలని ఆకాంక్షించారు.

ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించడం అభినందనీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఎల్ బాబురావు, జిల్లా కార్యదర్శి మురళి ప్రకాష్, జిల్లా సీపీఎస్ కన్వీనర్ ఎన్ రవి, కంచిలి మండల అధ్యక్షుడు మురళి నాయకో, ప్రధాన కార్యదర్శి లక్ష్మణరావు, సీనియర్ కామ్రేడ్స్ శమళ్ల వెంకట్రావు, పురుషోత్తం రెడ్డి, భగవతిరావు, నిరంజన్ ఖాడంగా, కాంతారావు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular