బెజ్జిభద్రపై గెలుపొందిన ఆర్.బెలగాం జట్టు.
మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ పిలక రవి.
కవిటి మండలం ఆర్.బెలగాంలో నవోదయ యువజన సంఘం, గ్రామస్థుల ఆధ్వర్యంలో 21 రోజులుగా జరుగుతున్న జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్లో భాగంగా మంగళవారం ఆర్.బెలగాం – బెజ్జిభద్ర జట్ల మధ్య ఉత్కంఠభరిత మ్యాచ్ జరిగింది. మొదట బ్యాటింగ్ చేసిన బెజ్జిభద్ర జట్టు నిర్ణీత 8 ఓవర్లకు 109 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఆర్.బెలగాం జట్టు మరో ఓవర్ మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించి విజయం సాధించింది.
ఈ మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్న ఆర్.బెలగాం జట్టు ఆటగాడు పిలక రవి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును దక్కించుకున్నాడు. ఈ అవార్డును గ్రామానికి చెందిన ఆర్మీ సైనికులు జీరు బోగేష్, జీరు భాస్కరావు అందజేశారు. 21 రోజులుగా కొనసాగుతున్న ఈ టోర్నీని తిలకించేందుకు క్రీడాకారులు, గ్రామస్థులు భారీగా తరలివచ్చి ఆటగాళ్లను ఉత్సాహపరిచారు. మ్యాచ్ అంతా ఉత్కంఠభరితంగా సాగడంతో ప్రేక్షకులు హర్షధ్వానాలు చేశారు.
