Homeక్రైమ్స్థల వివాదం - ఆరుగురికి గాయాలు

స్థల వివాదం – ఆరుగురికి గాయాలు

RAJAM : స్థలం వివాదం ... డోలపేటలో ఇరు కుటుంబాల మధ్య ఘర్షణ - ఆరుగురికి గాయాలు.

స్థలం వివాదం

డోలపేటలో ఇరు కుటుంబాల మధ్య ఘర్షణ – ఆరుగురికి గాయాలు.

ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో స్థలం వివాదం తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది.  రాజాం మున్సిపాలిటీ పరిధిలోని డోలపేటలో సోమవారం ఇరు కుటుంబాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.   స్థలం విషయంలో నెలకొన్న వివాదం ఒక్కసారిగా చెలరేగి పరస్పరం కర్రలు, రాళ్లు, గునపాలతో దాడులకు దిగారు.

ఈ ఘటనలో ఆరుగురు తీవ్రంగా గాయపడగా, స్థానికులు వెంటనే స్పందించి 108 అంబులెన్స్ సహాయంతో రాజాం ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు.  ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చి, ఇరు వర్గాలను చెదరగొట్టారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

RELATED ARTICLES

Most Popular