HomeUncategorizedఘనంగా పోలమ్మ తల్లి ఆలయ 4వ వార్షికోత్సవం

ఘనంగా పోలమ్మ తల్లి ఆలయ 4వ వార్షికోత్సవం

KANCHILI : ప్రత్యేక పూజలు, హోమాలు, భజనలు, భక్తిశ్రద్ధలతో నిర్వహణ.

ప్రత్యేక పూజలు, హోమాలు, భజనలు, భక్తిశ్రద్ధలతో నిర్వహణ.

కంచిలి మండలం బూరగాం గ్రామంలోని పోలమ్మతల్లి ఆలయ నాలుగవ వార్షికోత్సవం బుధవారం ఘనంగా నిర్వహించారు. వార్షికోత్సవం సందర్భంగా ఉదయం నుంచే ఆలయంలో ప్రత్యేక పూజలు, హోమం, అభిషేక పూజలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. అనంతరం భక్తులకు అమ్మవారి దర్శనం కల్పించారు. బోలాలింగేశ్వర భజన బృందంచే భజన కార్యక్రమం నిర్వహించగా భక్తులు భక్తిపారవశ్యంలో మునిగితేలారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ… గ్రామ ప్రజలు, భక్తులు అమ్మవారిని దర్శించుకుని ఆశీస్సులు పొందాలని కోరారు.

కార్యక్రమం అనంతరం భక్తులందరికీ అన్నప్రసాద వితరణ చేశారు. గ్రామ ప్రజలు, చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ మడ్డు వెంకటేశ్వరరావు, కన్వీనర్ కప్ప మీనారావు, సభ్యులు బద్రి నాగేశ్వరరావు, మాస్టిల మన్మధరావు, మడ్డు తిరుపతిరావు, బుడ్డ శ్యాము, బొట్ట తేజేశ్వరరావు, వజ్జల తారకేశ్వరరావు, మడ్డు రామరావు, బొడ్డు అప్పారావు, మడ్డు వెంకటరావు, బొట్ట గంగారావు, డొక్కరి రామరావు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular