మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ పిలక రవి.
కవిటి మండలం ఆర్.బెలగాంలో నవోదయ యువజన సంఘం, గ్రామస్థుల ఆధ్వర్యంలో 22 రోజులుగా జరుగుతున్న జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్లో భాగంగా బుధవారం ఆర్.బెలగాం – కరాపాడు జట్ల మధ్య హోరాహోరీగా మ్యాచ్ జరిగింది. మొదట బ్యాటింగ్ చేసిన కరాపాడు జట్టు నిర్ణీత 8 ఓవర్లకు 9 వికెట్లు నష్టపోయి 60 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్కు దిగిన ఆర్.బెలగాం జట్టు మరో ఓవర్ మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించి విజయం సాధించింది.

ఈ మ్యాచ్లో ఆల్రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్న ఆర్.బెలగాం జట్టు ఆటగాడు పిలక రవి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును దక్కించుకున్నాడు. ఈ అవార్డును గ్రామానికి చెందిన జీరు శ్యాంగుణ, జీరు ఏకాదశి, శ్రీనివాస్ రౌళో అందజేశారు. టోర్నమెంట్లో భాగంగా ప్రతి మ్యాచ్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును జీరు శ్యాంగుణ బహుకరించారు. 22 రోజులుగా కొనసాగుతున్న ఈ టోర్నీని తిలకించేందుకు క్రీడాకారులు, గ్రామస్థులు భారీగా తరలివచ్చి ఆటగాళ్లను ఉత్సాహపరిచారు. మ్యాచ్ అంతా ఉత్కంఠభరితంగా సాగడంతో ప్రేక్షకులు హర్షధ్వానాలు చేశారు.
