ప్రజా సమస్యల సత్వర పరిష్కారమే ప్రధాన లక్ష్యం – ఎమ్మెల్యే కార్యాలయంలో ప్రజా దర్బార్
స్థానిక శాసనసభ్యుల కార్యాలయంలో ఈరోజు ప్రజా సమస్యల తక్షణ పరిష్కారమే లక్ష్యంగా ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి నియోజకవర్గంలోని పలు గ్రామాలు, పట్టణ ప్రాంతాల నుండి ప్రజలు అధిక సంఖ్యలో హాజరై తమ సమస్యలను వినతిపత్రాల రూపంలో సమర్పించారు.
ఈ ప్రజా దర్బార్లో 25 వినతలను స్వీకరించడం జరిగింది. ముఖ్యంగా భూ వివాదాలు, గ్రామీణ మరియు పట్టణ ప్రాంత రహదారి సమస్యలు, డ్రైనేజీ సమస్యలు, పెన్షన్ మంజూరు, తక్కువ విద్యుత్ వోల్టేజ్, తాగునీటి సరఫరా లోపాలు తదితర ప్రజా సమస్యలకు సంబంధించిన వినతులు అందాయి.
ప్రతి సమస్యను శ్రద్ధగా పరిశీలించిన శాసనసభ్యులు, సంబంధిత అధికారులతో మాట్లాడి త్వరితగతిన పరిష్కార చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కరించేందుకు ఇలాంటి ప్రజా దర్బార్ కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతాయని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు మరియు ప్రజలు పాల్గొన్నారు.
