HomeUncategorizedకాశీబుగ్గ చోరీ కేసును ఛేదించిన ఖాకీలు

కాశీబుగ్గ చోరీ కేసును ఛేదించిన ఖాకీలు

ఏప్రిల్ 7వ తేదీనాడు కాశీబుగ్గ నిత్యానందనగర్ లోగల వెంకటేశ్వర జ్యుయలరి షాప్ లో మిట్టమద్యాహ్నం చోరీకి పాల్పడి బంగారు ఆభరణాలను దోచుకెళ్లిన దుండగులను పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు.

శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ మునిసిపాలిటీకి చెందిన నిత్యానందనగర్ లో గల శ్రీ వెంకటేశ్వర జ్యులరీ షాప్ లో ఏప్రిల్ 7వ తేదీ నాడు మిట్టమద్యాహ్నం12 గంటల ప్రాంతంలో 7గురు దుండగులు జిఎస్టీ అధికారులమంటూ షాప్ లో చొరబడి ఒంటరిగా ఉన్న యజమాని అయిన కిల్లంశెట్టి రామకృష్ణారావు ను పిస్టల్స్ తో బెదిరించి చేతులకు బేడీలు వేసి సుమారు 800 గ్రాముల బంగారు ఆభరణాలను దోచుకెళ్లారు.

సమాచారమందుకుని ఘటనాస్థలానికి చేరుకున్న కాశీబుగ్గ పోలీసులు కేసునమోదుచేసుకుని జిల్లా ఎస్పీ ఆదేశాలమేరకు ఖాకీలు టీమ్స్ గా ఏర్పడి రంగంలోకి దిగారు.

5గురు దుండగులను పట్టుకున్న పోలీసులు వారివద్దనుండి 243 గ్రాముల బంగారు ఆభరణాలను,3.41 లక్షలరూపాయల నగదును రికవరీ చేసినట్లు జిల్లా ఎస్పీ కే మహేశ్వర్ రెడ్డి మీడియా సమావేశంలో తెలిపారు.

జిల్లాఎస్పీ మాట్లాడుతూ పూర్తిగా సాంకేతిక ఆధారాలతోనే కేసును ఛేదించగలిగామని అన్నారు.దుండగులు ముఖానికి మాస్కులు చేతులకు గ్లౌజులు ధరించి షాప్ లో చొరబడి సిసి కెమెరాలపై నల్లటి స్ప్రే కొట్టి కెమెరాలకు చిక్కకుండా చేశారన్నారు.

చోరీకి పాల్పడిన దుండగులు టోల్ ప్లాజా మార్గం గుండా వెళ్లకుండా పలాస మండలం కేదారిపురం గ్రామం వరకు మోటార్ సైకిళ్లపై వెళ్లి అక్కడే ఓ లే ఔట్ లో ముందుగానే తెచ్చి పెట్టుకుని ఉన్న కారులో ఒడిశా వైపు పారిపొయినట్లు తెలిపారు.

పోలీసులకు చిక్కిన 5 గురు దుండగుల్లో 4 గురు ఒడిశా రాష్ట్రానికి చెందినవారు కాగా మరో దుండగుడు కాశీబుగ్గ కు చెందినవాడిగా గుర్తించామని,సదరు ముద్దాయి స్థానికుడు కావడంతో అతడి సహకారంతోనే దుండగులు చోరీకి స్కెచ్ గీసినట్లు జిల్లా ఎస్పీ వివరించారు.2023 లొనే రెక్కీ నిర్వహించారని,తాజాగా మరోసారి రెకీ నిర్వహించి చోరీకి పాల్పడ్డారని ముద్దాయిలు తెలిపినట్లు ఎస్పీ చెపుతున్నారు.

చోరీకి ఉపయోగించిన టు వీలర్,ఫోర్ వీలర్ వాహనాలు, పిస్టల్స్,మొబైల్ ఫోన్లు ను స్వాధీనపరచుకున్న పోలీసులు పలు సెక్షన్ల పై కోర్టులో హాజరుపరుస్తున్నట్లు జిల్లా ఎస్పీ కే.మహేశ్వర్ రెడ్డి తెలిపారు

RELATED ARTICLES

Most Popular