HomeUncategorizedనిరంతర సాధనకు నిదర్శనం హాసిని

నిరంతర సాధనకు నిదర్శనం హాసిని

ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పేద కుటుంబానికి చెందిన విద్యార్థిని 589 మార్కులతో మండల ప్రథమ స్థానం

నిరంతర సాధనకు నిదర్శనం హాసిని

589 మార్కులతో మండల ప్రథమ స్థానం

కంచిలి
మండల పరిధిలోని బూరగాం గ్రామానికి చెందిన హాసిని 589 మార్కులు సాధించి మండలంలో ప్రథమ స్థానం సాధించింది. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పేద కుటుంబానికి చెందిన ఈ విద్యార్థిని సాధించిన విజయం స్థానికంగా ప్రశంసలు అందుకుంటోంది.

విజయానికి మార్గదర్శకత్వం:  విద్యాశాఖ అందించిన మోడల్ పేపర్లు, ప్రశ్న బ్యాంకులను ఆధారంగా తీసుకుని క్రమపద్ధతిలో సాధన చేయడం తన విజయానికి కారణమని హాసిని తెలిపింది. ఉపాధ్యాయుల మార్గదర్శకత్వం తనలో ఆత్మవిశ్వాసాన్ని పెంచిందని పేర్కొంది. వంద రోజుల ప్రణాళిక కూడా తనకు ఎంతో ఉపయోగపడిందని వెల్లడించింది.

అభినందన: ఈ సందర్భంగా ప్రభుత్వ విప్, ఇచ్చాపురం నియోజకవర్గ శాసనసభ్యులు బెందాళం అశోక్ బాబు తన కార్యాలయంలో హాసిని (589), బద్రి మధులత (574)లను సన్మానించారు. విద్యార్థులతో ముచ్చటిస్తూ తల్లిదండ్రులు, గ్రామానికి మంచి పేరు తీసుకువచ్చిన మీరు భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి చేరాలని ఆకాంక్షించారు.విద్యార్థుల విజయానికి కృషి చేసిన ఉపాధ్యాయులు నిరంజన్, హిందీ ఉపాధ్యాయుడు కాంతారావు, గణితం–సైన్స్ ఉపాధ్యాయులను ఎమ్మెల్యే అభినందించారు.

ఈ కార్యక్రమంలో సర్పంచ్ ప్రతినిధి అప్పారావు, గ్రామ పెద్దలు బద్రి సుబ్బారావు, జానకిరామ్, బద్రీనాథ్, బద్రి ఢిల్లీ రావు, లోకనాథం, మాధవరావు, విజయకుమారి, యువకుడు సింహాద్రి, ఉపాధ్యాయులు కాంతారావు, నిరంజన్, ఖడంగా ప్రేమ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular