HomeUncategorizedమెగా మెడికల్ క్యాంప్

మెగా మెడికల్ క్యాంప్

మేడే సందర్భంగా ఎమ్మెల్యే గౌతు శిరీష చేతులమీదుగా పలాస జర్నలిస్ట్స్ అసోసియేషన్ సభ్యులు ఏర్పాటు చేసిన మెగా మెడికల్ క్యాంప్

మేడే సందర్భంగా పలాస జర్నలిస్ట్స్ అసోసియేషన్ సభ్యులు ఏర్పాటు చేసిన మెగా మెడికల్ క్యాంప్ కు వందలాదిమంది ప్రజలు హాజరవగా, రోగులకు ఉచితంగా వైద్యసేవలందించదాంతోపాటు ఉచిత మందులను సరఫరా చేసి జర్నలిస్టులు వారి ఉదారస్వభావాన్ని చాటుకున్నారు.

శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ మునిసిపాలిటీ కి చెందిన పలాస జర్నలిస్ట్స్ అసోసియేషన్ సభ్యులు మేడే సందర్భంగా ఏర్పాటుచేసిన మెగా వైద్య శిబిరాన్ని ముఖ్య అతిధి పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష ప్రారంభించగా, మాజీ మంత్రి డా.సీదిరి అప్పలరాజు హాజరై వైద్య శిబిరాన్ని సందర్శించారు.

పలాస పట్టణానికి చెందిన అన్ని విభాగాలకు చెందిన సుమారు 30 మంది ప్రముఖ వైద్యులు వారి నిస్వార్థ సేవలను అందించగా, హోమియోపతిక్ వైద్యులు హాజరై ఉచితంగా రోగులకు మందులను అందజేశారు.

సుమారు 700 మంది ప్రజలు వైద్య శిబిరం లో హాజరై చికిత్సలు చేయించుకున్నారు.  శ్రీకాకుళం మెడికవర్ హాస్పిటల్ వైద్యులు పాల్గొని ఉచితంగా రోగులకు ఈ.సి.జి, బిపి, షుగర్ లాంటి పరీక్షలను చేయగా, పలాస కాశీబుగ్గ హోల్ సేల్ అండ్ రిటైల్ మెడికల్ అసోసియేషన్ సభ్యులు నాణ్యమైన మందులను రోగులకు ఉచితంగా అందజేసి వారి మానవత్వాన్ని మరోసారి చాటుకున్నారు.

వైద్య శిబిరం లో పాల్గొన్న ప్రజలకు ప్రెస్ క్లబ్ సభ్యులు మంచినీరు,  మజ్జిగ,  పులిహోర ను అందించారు.

పలాస జర్నలిస్ట్స్ అసోసియేషన్ వారు నిర్వహించిన మెడికల్ క్యాంప్ వైద్యులు, హోల్ సేల్ అండ్ రిటైల్ మెడికల్ అసోసియేషన్ సభ్యులు,  మునిసిపల్ కమీషనర్ మరియు సిబ్బంది కాశీబుగ్గ పోలీసులు ఇంత ఘణ విజయానికి కారకులంటూ ప్రెస్ క్లబ్ అధ్యక్ష,కార్యదర్సులు నేతాజీ, జయంత్ కుమార్ లు ప్రెస్ క్లబ్ సభ్యుల తరపున ధన్యవాదాలు తెలియజేసారు.

RELATED ARTICLES

Most Popular