Homeఆంధ్రప్రదేశ్వినియోగదారుల క్లబ్బులు బలోపేతానికి పౌర సరఫరాల శాఖ కార్యాచరణ.

వినియోగదారుల క్లబ్బులు బలోపేతానికి పౌర సరఫరాల శాఖ కార్యాచరణ.

SRIKAKULAM: వినియోగదారుల క్లబ్బులు బలోపేతానికి పౌర సరఫరాల శాఖ కార్యాచరణ.

వినియోగదారుల క్లబ్బులు బలోపేతానికి పౌర సరఫరాల శాఖ కార్యాచరణ.

నిన్న ఈ రోజు అన్ని జిల్లాల మాస్టర్ ట్రైనర్లకు వర్చువల్ శిక్షణ.

శ్రీకాకుళం నుండి ఎల్ వెంకటాచలం  మరియు బి. శ్రీనివాసరావు హాజరు .

రాష్ట్రంలో వినియోగదారుల క్లబ్బులను సమర్ధ వంతంగా నడిచేలా చూడాలని అందుకు ఈ శిక్షణ ఉపయోగించుకోవాలని పౌరసరఫరాల వినియోగ వ్యవహారాల డైరెక్టర్ శ్రీవాస్ నుపర్ అజయ్ కుమార్ ప్రారంభ ఉపన్యాసం చేశారు.  అనంతరం ఈ శిక్షణలో వినియోగదారుల రక్షణ చట్టం, వినియోగదారుల హక్కులు బాధ్యతలు పర్యావరణం ,పరిరక్షణ వస్తువులు కొనుగోలు, ఆహారపు కల్తీ మరియు నాణ్యత, నష్టపోయే సందర్భంలో కమీషన్ ను ఆశ్రయించే విధానం తదితర అంశాలు పై విషయనిపుణులు డా పి వి వి ఎస్ మూర్తి,చక్కా సుశీ కె కృష్ణ మోహన్ మరియు డా సిహెచ్ గోపాల కృష్ణ శిక్షణ ఇచ్చారు.

ప్రతి శనివారం పాఠశాలల్లో నిర్వహిస్తున్న నో బ్యాగ్ డే కార్యక్రమాల్లో వినియోగదారులకు సంబంధించిన అంశాలని, కృత్యాలని విద్యార్థులకు చేరవేయాలన్నారు. జిల్లా స్థాయి లేదా డివిజన్ స్థాయి లో పాఠశాల క్లబ్ టీచర్ గైడ్ లకు శిక్షణను ఇవ్వాలని మాస్టర్ ట్రైనరలకు సూచించారు .

ఈ కార్యక్రమంలో విజయ వాడ ఆఫీసు డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసరావు , శ్రీకాకుళం నుంచి జిల్లా మాస్టర్ ట్రైనర్ ఎల్ వెంకటాచలం, బి శ్రీనివాసరావు అన్ని జిల్లాల మాస్టర్ ట్రైనర్లు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular