Homeఆంధ్రప్రదేశ్దివ్యాంగుల(డిఎస్సి) పోస్టులకు ధరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అవసరమైన ధృవపత్రాలు సమర్పించాలి.

దివ్యాంగుల(డిఎస్సి) పోస్టులకు ధరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అవసరమైన ధృవపత్రాలు సమర్పించాలి.

Srikakulam: దివ్యాంగుల(డిఎస్సి) పోస్టులకు ధరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అవసరమైన ధృవపత్రాలు సమర్పించాలి.

దివ్యాంగుల(డిఎస్సి) పోస్టులకు ధరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అవసరమైన ధృవపత్రాలు సమర్పించాలి.

జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్.

శ్రీకాకుళం: దివ్యాంగుల(డిఎస్సి) పోస్టులకు ధరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అవసరమైన ధృవపత్రాలు సమర్పించాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ బుధవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. జిల్లాలో 2025-26 సంవత్సరానికి దివ్యాంగుల సంక్షేమ బ్యాక్ లాగ్ (DSC) కోటా కింద వివిధ ప్రభుత్వ శాఖలలో దివ్యాంగులకు రిజర్వు చేయబడిన బ్యాక్ లాగ్ ఖాళీల భర్తీకి జారీ చేసిన నోటిఫికేషన్ కు అనుగుణంగా అభ్యర్థుల నుండి దరఖాస్తులు స్వీకరించిన దరఖాస్తుల పరిశీలనలో కొంతమంది అభ్యర్థులు నోటిఫికేషన్లో పేర్కొన్న అవసరమైన ధ్రువపత్రాలు / పత్రాలను సమర్పించనందున, అటువంటి అభ్యర్థుల జాబితా జిల్లా కలెక్టర్ కార్యాలయం, శ్రీకాకుళం నోటీస్ బోర్డులో జిల్లా వెబ్ సైట్ లో *srikakulam.ap.gov.in.*లో ప్రచురించినట్లో ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

ఆ జాబితాలో పేర్లు ఉన్న అభ్యర్థులు జూలై 9వ తేదీ నుండి 7 (ఏడు) రోజుల లోపు అవసరమైన ధ్రువపత్రాలను జిల్లా కలెక్టర్ మరియు చైర్మన్, జిల్లా సెలక్షన్ కమిటీ, శ్రీకాకుళం -532001 నకు రిజిస్టర్డు పోస్టు ద్వారా లేదా సీల్డ్ కవర్లో ఉంచి కార్యాలయ పని వేళల్లో (ఉదయం 10:30 గంటల నుండి సాయంత్రం 5:00 గంటల వరకు) A-సెక్షన్, కలెక్టర్ వారి కార్యాలయం, శ్రీకాకుళం వద్ద ఉన్న డ్రాప్ బాక్స్ నందు నేరుగా సమర్పించ వచ్చన్నారు. నిర్దేశించిన గడువు లోపు అవసరమైన ధ్రువపత్రాలను సమర్పించని పక్షంలో వారి అభ్యర్థిత్వం అనర్హంగా పరిగణించబడుతుందన్నారు. అనంతరం ఈ విషయమై ఎలాంటి విజ్ఞప్తులు లేదా అభ్యర్థనలు స్వీకరించబడనవని తెలిపారు.

RELATED ARTICLES

Most Popular