Homeఆంధ్రప్రదేశ్ నందిగాం  పోలీస్ స్టేషన్‌ను జిల్లా ఎస్పీ ఆకస్మిక తనిఖీ.

 నందిగాం  పోలీస్ స్టేషన్‌ను జిల్లా ఎస్పీ ఆకస్మిక తనిఖీ.

NANDIGAM:  నందిగాం  పోలీస్ స్టేషన్‌ను జిల్లా ఎస్పీ ఆకస్మిక తనిఖీ.

శ్రీకాకుళం జిల్లా పోలీసు.

ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలి.

ఫిర్యాదుదారుల సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్న జిల్లా ఎస్పీ కె.వి. మహేశ్వర రెడ్డి, ఐపీఎస్.

నందిగాం  పోలీస్ స్టేషన్‌ను జిల్లా ఎస్పీ ఆకస్మిక తనిఖీ.

నందిగాం పోలీస్ స్టేషన్‌ను జిల్లా ఎస్పీ శ్రీ కె.వి. మహేశ్వర రెడ్డి, ఐపీఎస్ గారు మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్‌లోని పలు రికార్డులను, పెండింగ్‌లో ఉన్న కేసుల వివరాలను, ముఖ్యమైన కేసుల దర్యాప్తు పురోగతిని క్షుణ్ణంగా పరిశీలించారు.

ఈ క్రమంలో స్టేషన్‌కు వచ్చిన ఫిర్యాదు దారులతో జిల్లా ఎస్పీ స్వయంగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఫిర్యాదుదారులతో పోలీసులు మర్యాదపూర్వకంగా, బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, వారి సమస్యలను సానుభూతితో విని, చట్టపరమైన పరిష్కారం చూపేందుకు చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు.పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసుల దర్యాప్తు పురోగతిని పరిశీలించిన ఎస్పీ, ముఖ్యమైన కేసుల్లో దర్యాప్తును వేగవంతం చేసి, ఆధారాలను పకడ్బందీగా సేకరించి, నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించేలా ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.అదేవిధంగా స్టేషన్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ, అసాంఘిక కార్యకలాపాలపై నిఘా, ప్రజలకు మెరుగైన పోలీసు సేవలు అందించే అంశాలపై సిబ్బందికి జిల్లా ఎస్పీ పలు సూచనలు చేశారు.

జిల్లా ఎస్పీ వెంట ఎస్బి ఇన్స్పెక్టర్ టి. ఇమ్మనయ్యాల్ రాజు ఉన్నారు.

RELATED ARTICLES

Most Popular