ట్రైన్ ఎక్కుతుండగా జారిపడిన యువకుడు
పలాస రైల్వే స్టేషన్లో ప్రమాదం చోటుచేసుకుంది. ఒడిశాకు చెందిన బీమా బెహరా (30) ట్రైన్ ఎక్కుతుండగా ప్రమాదవశాత్తు జారిపడ్డారు. ఈ ఘటనలో ఆయన తలకు తీవ్ర గాయాలయ్యాయి.
సమాచారం అందుకున్న వెంటనే 108 సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పైలెట్ వెంకట్రావు, EMT సత్యం బాధితుడికి ప్రథమ చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
