రేపటి నుండి పి డి యస్ యు రాష్ట్ర విద్యా, వైజ్ఞానిక శిక్షణ తరగతులు – పి డి యస్ యు రాష్ట్ర అధ్యక్షులు కె.భాస్కర్.
ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (PDSU ) రాష్ట్రస్థాయి విద్యా ,వైజ్ఞానిక శిక్షణా తరగతులు రేపటినుండి రెండో రోజులపాటు కాశీబుగ్గలోని టీకేఆర్ కళ్యాణ మండపంలో జరగనున్నాయి. ఈ శిక్షణ తరగతులు విజయవంతం చేయాలని పి డి యస్ యు రాష్ట్ర అధ్యక్షులు కె.భాస్కర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.వినోద్ కుమార్ పిలుపునిచ్చారు.
గురువారం పలాస సూది కొండ కాలనీ పి డి యస్ యు కార్యాలయంలో వారు మాట్లాడుతూ విద్యారంగంలో వస్తున్నటువంటి మార్పులు, శాస్త్రీయ, లౌకిక, ప్రజాస్వామ్యక విలువల పరిరక్షణ కోసం విద్యార్థులు శాస్త్రీయ దృక్పథాన్ని కల్పించడానికి,ఉపాధి విద్య కొరకు ఈ తరగతులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఈ తరగతుల ప్రారంభ ఉపన్యాసానికి ఆంధ్ర యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ సురప్పడు, ఉన్నత విద్య, ఉపాధి సవాలు అనే అంశాన్ని బోధించడానికి అఖిల భారత విద్యా హక్కుల వేదిక నాయకులు రమేష్ పట్నాయక్, జాతీయ అంతర్జాతీయ పరిస్థితులు అనే అంశాన్ని బోధించడానికి పి.ప్రసాద్, సామాజిక మార్పు విద్యార్థులు పాత్ర అనే అంశాన్ని బోధించడానికి సన్నశెట్టి రాజశేఖర్ ఏపీటీఎఫ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ రాష్ట్ర అధ్యక్షులు తదితరులు హాజరవుతున్నారు.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న విద్యా వ్యతిరేక విధానాలపై చర్చించి భవిష్యత్తు కార్య చరణ రూపొందించుకోవడం జరుగుతుంది. ఈ విద్య వైజ్ఞానిక ,శిక్షణ తరగతులు విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర సహాయ కార్యదర్శి వీరేంద్ర ప్రసాద్, రాష్ట్ర నాయకులు ప్రసాద్, రమణ, శంకర్, జిల్లా నాయకులు విజయ్, భరత్ మొదలైన వారు పాల్గొన్నారు.
