ఉపాధ్యాయులను గౌరవిస్తూ చదవాలి… ఉన్నత శిఖరాలకు వెళ్తాం….
ఇంటర్మీడియట్ రాష్ట్ర ప్రథమ ర్యాంకర్ కర్రీ అనిత…. ముఖ్యఅతిథి లోళ్ళ రాజేష్… గత విద్యా సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సర ఫలితాలలో కమిటీ పట్టణానికి చెందిన కళ్యాణి కాలేజ్ విద్యార్థిని కర్రి అనిత 470 మార్కులకు 468 కవచం చేసుకుని రాష్ట్ర స్థాయిలో ప్రధమ ర్యాంకర్ గా నిలిచినందుకు కళ్యాణి ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆవరణంలో కరస్పాండెంట్ రాజేష్ ఆధ్వర్యంలో విద్యార్థుల సమక్షంలో చిరు సత్కారాన్ని గురువారం సాయంకాలం నిర్వహించారు. ఈ సందర్భంగా కరెస్పాండెంట్ లాల్ రాజేష్ మాట్లాడుతూ ఒక ఫిషర్ మాన్ గ్రామంలో పుట్టి వ్యవసాయ కూలీ కుటుంబానికి చెందిన కర్రీ అనిత నామమాత్రపు వసతులతో జీవించి నేడు రాష్ట్ర ప్రధమ ర్యాంకర్ గా నిలిచినందుకు ప్రతి ఒక్క విద్యార్థికి స్ఫూర్తిదాయకం కావాలని ఆమె యొక్క నిత్యజీవితంలో జీవనశైలి అనిత చదివే విధానం ఆమె నడవడిక ఉపాధ్యాయుల పై ఆమెకు ఉన్న మక్కువ వంటి వల్ల రాష్ట్రస్థాయిలో ప్రథమ ర్యాంకర్ గా నిలిచానని తెలియజేశారు.

అనిత ను ప్రతి ఒక్క విద్యార్థి ఆదర్శంగా తీసుకొని మీరు కూడా ఇంకా ఉన్నత శిఖరాలకు వెళ్లాలని రాజేష్ విద్యార్థులకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా విద్యార్థుల ఉద్దేశించి అనిత మాట్లాడుతూ మొదటి రోజు నుంచి ఉపాధ్యాయులు చెప్పిన పాఠాలను శ్రద్ధగా చదివినచో ప్రతి ఒక్క విద్యార్థి తప్పకుండా మొదటి ర్యాంకులో నిలుస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ బిందు మాధవి ఏవో రాణి డైరెక్టర్ రమేష్ తో పాటు ఇతర ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు
