KANCHILI : ప్రజాసేవలో ఆదర్శం – గొనప కృష్ణమూర్తి నాయుడు.
గాజువాక జిల్లా న్యాయమూర్తి, గొనప షణ్ముఖరావు తండ్రి, గొనప కృష్ణమూర్తి నాయుడు సంతాప సభ ఆదివారం స్వగ్రామం కంచిలి మండలం చిన్నఖొజ్జిరియాలో ఘనంగా నిర్వహించారు. గ్రామ ప్రజలు, బంధుమిత్రులు, ప్రజాప్రతినిధులు, వివిధ రంగాల ప్రముఖులు పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
గ్రామాభివృద్ధి, సామాజిక సేవల పట్ల ప్రత్యేక ఆసక్తి కలిగిన వ్యక్తిగా కృష్ణమూర్తి నాయుడు గుర్తింపు పొందారని వక్తలు కొనియాడారు. గ్రామ ప్రజలతో సాన్నిహిత్యం కలిగి అందరికీ ఆదర్శంగా నిలిచారని, ఆయన మరణం గ్రామానికి తీరనిలోటని పేర్కొన్నారు. ఈ సందర్భంగా గొనప షణ్ముఖరావు కుటుంబ సభ్యులకు పలువురు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సభకు టీవీ రమణ, బొడ్డు రాంకుమార్, బెందాళం శోభన్ బాబు, బొడ్డు వెంకటరావు, రమేష్, పిలక సోమేశ్, ప్రధాన లజపతిరాయ్, గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు, గ్రామస్తులు, కళాకారులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
