Homeఆంధ్రప్రదేశ్భద్రత, నాణ్యత ప్రమాణాల గుర్తులపై వినియోగదారులకు అవగాహన అవసరం

భద్రత, నాణ్యత ప్రమాణాల గుర్తులపై వినియోగదారులకు అవగాహన అవసరం

PALASA : భద్రత, నాణ్యత ప్రమాణాల గుర్తులపై వినియోగదారులకు అవగాహన అవసరం

భద్రత,నాణ్యత ప్రమాణాల గుర్తుల పై వినియోగ దారులకు అవగాహన అవసరం
జిల్లా వినియోగదారుల క్లబ్బుల మాస్టర్ ట్రైనర్ ఎల్ వెంకటాచలం
నేడు ప్రపంచ ప్రమాణాల దినోత్సవం

వినియోగదారులు వస్తువులను కొనుగోలు చేసే సమయంలో నాణ్యత, భద్రత ప్రమాణాల గుర్తులను తప్పనిసరిగా పరిశీలించాలని జిల్లా వినియోగదారుల క్లబ్బుల మాస్టర్ ట్రైనర్, బీఐఎస్ క్లబ్ మెంటార్ ఎల్. వెంకటాచలం సూచించారు. ప్రపంచ ప్రమాణాల దినోత్సవం సందర్భంగా బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.

నాణ్యత, భద్రత, విశ్వసనీయత కలిగిన వస్తువులను వినియోగించడం ప్రతి వినియోగదారుడి హక్కు అని వెంకటాచలం పేర్కొన్నారు. నిత్యజీవితంలో ఉపయోగించే వస్తువులను కొనుగోలు చేసేటప్పుడు వాటిపై ఉన్న ఐఎస్ఐ గుర్తు, బంగారు ఆభరణాలపై హాల్‌మార్క్, ఎలక్ట్రానిక్ ఉత్పత్తులకు సంబంధించిన ప్రమాణాల గుర్తులను పరిశీలించాలని సూచించారు.

ప్రమాణాలు ప్రజల ఆరోగ్యం, భద్రతను కాపాడటంతో పాటు నాణ్యమైన ఉత్పత్తుల తయారీకి, వినియోగదారుల హక్కుల పరిరక్షణకు దోహదపడతాయని తెలిపారు. ప్రతి సంవత్సరం అక్టోబర్ 14న ప్రమాణాల ప్రాధాన్యతపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు ప్రపంచ ప్రమాణాల దినోత్సవాన్ని నిర్వహిస్తారని వివరించారు.

విద్యార్థులు తమ ఇళ్లలో, పరిసర ప్రాంతాల్లో నాణ్యత ప్రమాణాలపై అవగాహన కల్పిస్తూ, నాణ్యమైన వస్తువుల వినియోగాన్ని ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. భారత ప్రమాణాల సంస్థ (బీఐఎస్) రూపొందించిన BIS Care యాప్ ద్వారా కూడా సంబంధిత ఉత్పత్తుల ప్రమాణాలు, ధ్రువీకరణ వివరాలను తెలుసుకోవచ్చని పేర్కొన్నారు.

వినియోగదారులు నాణ్యత, భద్రత ప్రమాణాలను గుర్తించి, జాగ్రత్తగా వస్తువులను కొనుగోలు చేసినప్పుడే మోసాలకు దూరంగా ఉంటూ తమ హక్కులను కాపాడుకోగలరని ఎల్. వెంకటాచలం తెలిపారు.

RELATED ARTICLES

Most Popular