టెక్కలిపట్నం గ్రామ సందర్శన :
ఈ దినము అనగా తేదీ 11.05.2026న కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ S.I., R.నరసింహమూర్తి మరియు సిబ్బంది తో కలిసి, పలాస మండలంలోని టెక్కలిపట్నం గ్రామo సందర్శించి, గ్రామ జంక్షన్లో గ్రామస్తులతో సమావేశం ఏర్పాటు చేసి నారీ శక్తి గురించి, కొత్త చట్టాల గురించి రాబోవు స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా అవగాహన కల్పించి, గ్రామంలో దేవాలయాలు, మసీదులు, చర్చ్ లు ఏమైనా ఉంటే వాటికి CC కెమెరాలు అమర్చమని, అదేవిధంగా గ్రామంలో ఏమైనా పండుగలు గాని, ఉత్సవాలుగాని జరిగినప్పుడు పోలీస్ స్టేషన్ కు సమాచారం ఇవ్వమని తెలియచేయయడం జరిగింది.
అదేవిధంగా సైబర్ నేరాలు, ఆన్లైన్ మోసాలు, బెట్టింగ్, పేకాట, గంజాయి, నాటు సారా అక్రమ రవాణా మరియు అమ్మకం గురించి అవగాహన కల్పించి, బాల్యవివాహాలు, మహిళలపై జరుగు నేరాలు, 112 కాల్ ఉపయోగం, మొదలైన వాటి గురించి అవగాహన కార్యక్రమం నిర్వహించడం అయినది.
