బాధిత కుటుంబానికి సి.ఎం. రిలీఫ్ ఫండ్ చెక్కు అందజేత…
ఇచ్చాపురం మండలం పురుషోత్తపురం గ్రామానికి చెందిన పత్రి మహాలక్ష్మి అనారోగ్యం కి గురై, ఇటీవల మృతి చెందింది. ఈ మేరకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి బాధిత కుటుంబ సభ్యులకు మంజూరైన 68 వేల 673 రూపాయలు చెక్కును ఆదివారం అందజేశారు. సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా వారు కోరారు. ఈ కార్యక్రమంలో కాళ్ల దిలీప్ కుమార్, మణి చంద్ర ప్రకాష్ రెడ్డి, పత్రీ తవిటయ్య, తేజ మజ్జి,
ఎన్ కోటి తదితరులు పాల్గొన్నారు.
