Homeఆంధ్రప్రదేశ్ఆధ్యాత్మికోత్సాహంలో హనుమాన్ జయంతి వేడుకలు.

ఆధ్యాత్మికోత్సాహంలో హనుమాన్ జయంతి వేడుకలు.

KANCHILI : ఆలయ పరిసరాలు జై శ్రీరామ్, జై హనుమాన్ నామస్మరణలతో మారుమోగాయి.

ఆధ్యాత్మికోత్సాహంలో హనుమాన్ జయంతి వేడుకలు పెద్ద కోజ్జీరియా భక్తులతో కళకళలాడిన అభయాంజనేయ స్వామి ఆలయ ప్రాంగణం.

భక్తి, సంప్రదాయం, గ్రామీణ ఆధ్యాత్మిక సంస్కృతికి ప్రతీకగా హనుమాన్ జయంతి వేడుకలు కంచిలి మండలం పెద్ద కోజ్జీరియా గ్రామంలో ఘనంగా నిర్వహించబడ్డాయి. గ్రామంలో వెలసిన శ్రీ అభయాంజనేయ స్వామి విగ్రహం వద్ద ప్రత్యేక పూజలు, హోమాలు, భజనలు, హారతులతో ఆలయ ప్రాంగణం భక్తిరసమయం అయింది.

ఈ వేడుకలను తరకేశ్ దంపతులు మరియు పృథ్వీ, సుందర్ రావు, వసంత్, రాజేంద్ర, మరియు గ్రామ పెద్దలు అంగరంగ వైభవంగా నిర్వహించి స్వామివారికి ప్రత్యేక అలంకరణలు చేయించారు. తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయానికి చేరుకుని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక ప్రార్థనలు చేశారు.

గ్రామ యువత, మహిళలు, పెద్దలు ఉత్సాహంగా పాల్గొనడంతో పెద్ద కోజ్జురియా గ్రామం పండుగ వాతావరణాన్ని తలపించింది. అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ నిర్వహించారు. ఆలయ పరిసరాలు జై శ్రీరామ్, జై హనుమాన్ నామస్మరణలతో మారుమోగాయి.

RELATED ARTICLES

Most Popular