దేశ సేవే ధ్యేయంగా.. పార్టీ సిద్ధాంతాలే మార్గదర్శకాలు గా పనిచేయాలి…
బిజెపి శ్రేణులకు పిలుపు నిచ్చిన రాష్ట్ర అధ్యక్షులు మాధవ్..
పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహా అభియాన్ – 2026 లో భాగంగా ఎచ్చెర్ల BLA -1 నడుకుదిటి తేజబాబు ఆధ్వర్యంలో NER స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ వేదిక గా ఎచ్చెర్ల శాసనసభ్యులు నడుకుదిటి ఈశ్వరరావు గారి అధ్యక్షతన నిర్వహించిన శ్రీకాకుళం జిల్లా ప్రశిక్షణ సమావేశం లో బిజెపి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ PVN మాధవ్ గారు ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.
ఈ సందర్బంగా మాధవ్ గారు మాట్లాడుతూ దేశ రక్షణే మొదటి కర్తవ్యంగా భావించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎన్నో కార్యక్రమాలు విజయ వంతం చేస్తున్నారన్నారని, భారతదేశాన్ని ప్రపంచలోనే అగ్రరాజ్యంగా తీర్చిదిద్దడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారన్నారని దాని ఫలితం మొన్న జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ప్రస్ఫూటం అయ్యిందని పేర్కొన్నారు. ఇటువంటి తరుణంలో ప్రజలంతా ఆయనకు మద్దతు తెలపాలని, భారతదేశాన్ని విశ్వగురువు స్థానాన్ని సుస్థిరం చేయడానికి మద్దత్తు అందించాలని కోరారు.
ఈ కార్యక్రమం లో జిల్లా అధ్యక్షులు సిరిపురం తేజేశ్వరరావు, ప్రోగ్రాం ఇంచార్జ్ ప్రకాష్ రెడ్డి, జిల్లా ఇంచార్జ్ విజయానంద రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షులు పైడి వేణుగోపాలం, రాష్ట్ర అధికార ప్రతినిధి పూడి తిరుపతిరావు, రాష్ట్ర కళింగ కార్పొరేషన్ డైరెక్టర్ అట్టాడ రవిబాబ్జి, బిర్లాంగి ఉమా మహేశ్వరరావు, సవ్వనా ఉమామహేశ్వరీ, డాక్టర్ సింధుర తదితరులు పాల్గొన్నారు.
