Homeఆంధ్రప్రదేశ్తక్కువ వర్షపాతానికీ విత్తన గులికలపై అవగాహన.

తక్కువ వర్షపాతానికీ విత్తన గులికలపై అవగాహన.

KANCHILI : సోంపేట డివిజన్ కంచిలి మండలం ముండ్ల గ్రామంలో రైతులకు విత్తన గులికల (సీడ్ బాల్స్) తయారీ, వినియోగంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. 

తక్కువ వర్షపాతానికీ మెరుగైన మొలకలు.

ముండ్ల గ్రామంలో రైతులకు విత్తన గులికలపై అవగాహన.

కంచిలి: సోంపేట డివిజన్ కంచిలి మండలం ముండ్ల గ్రామంలో రైతులకు విత్తన గులికల (సీడ్ బాల్స్) తయారీ, వినియోగంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.   రైతుల సమక్షంలో విత్తన గులికలు తయారుచేసి కాంప్లెక్స్ బ్లాక్ పరిధిలో ఐదు ఎకరాల్లో లైన్ షోయింగ్ పద్ధతిలో విత్తనాలు వేశారు.   ఈ కార్యక్రమంలో రైతులు అర్జున ప్రధాన్, కృష్ణచంద్ర మహాపాత్ర, హ్యూమన్ ప్రధాన్, హరిచంద్ర ప్రధాని, దేవేంద్ర ప్రధాన్ పాల్గొని విత్తన గులికలను పొలాల్లో వినియోగించారు.

ఈ సందర్భంగా కంచిలి మండలం, ముండ్ల గ్రామంలో ఫీల్డ్ మాస్టర్ ట్రైనర్ శివానందం మాట్లాడుతూ విత్తన గులికల విధానం వల్ల సాధారణ వర్షపాతం కంటే తక్కువ వర్షాలు వచ్చినా మొలకశాతం మెరుగ్గా ఉంటుందని తెలిపారు.  ఎండకాలంలో విత్తనాలు వేసినా అవి భూమిలో సురక్షితంగా నిల్వ ఉండి, వర్షాలు కురిసిన వెంటనే మంచి మొలకలు వస్తాయని వివరించారు.

చీడపీడల ప్రభావం నుంచి విత్తనాలను రక్షించడంతో పాటు భూమిలోని సూక్ష్మజీవులు ఎండబారకుండా కాపాడటంలో ఈ విధానం ఉపయోగపడుతుందని చెప్పారు. తక్కువ వర్షపాతం ఉన్నా రైతుకు ఏదో ఒక పంట ద్వారా ఆదాయం లభించే అవకాశముందని, భూమి ఎల్లప్పుడూ పచ్చని పంటలతో కప్పబడి ఉండటం వల్ల తేమశాతం,  జీవవైవిధ్యం పెరుగుతాయని పేర్కొన్నారు.  కార్యక్రమంలో రైతులతో పాటు లీడ్ ఫార్మర్స్,  అంపూరం యూనిట్ ఐసిఆర్పీలు,  ట్రైనీ ఐసిఆర్పీలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular