ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా , సంతకవిటి మండలం , పొనుగుటి వలస గ్రామంలో శ్రీ అసిరి తల్లి గుడిలో అర్ధరాత్రి గుర్తుతెలియని దుండగులు చొరబడి ఆలయాన్ని ధ్వంసం చేసారు. ఇది గమనించిన గ్రామస్తులు ఒక్కసారి షాక్ కు గురయ్యారు.

గత కొన్నేళ్లుగా హిందూ దేవాలయాలపైన , గ్రామ దేవత విగ్రహాలపైన వరుసగా జరిగిన దాడులు మరువక ముందే పొనుగుటి వలస గ్రామంలో గ్రామ దేవత గుడి ధ్వంసం పై భక్తులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.
హిందూ డేవాలయాలపై జరుగుతున్న వరుస దాడులతో హిందువుల మనోభావాలు దెబ్బతినే ప్రమాదమున్న నేపధ్యంలో పాలకవర్గాలు సహితం దృష్టిసారించాలని పలువురు కోరుతున్నారు.
ధ్వంసానికి గురైన దేవాలయం విషయంలో పోలీసులు విచారణ జరిపి దుండగులపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.
