Homeఆంధ్రప్రదేశ్స్వయంభూ గా వెలసిన తల్లే.... శ్రీ స్వేచ్చావతి అమ్మవారు.

స్వయంభూ గా వెలసిన తల్లే…. శ్రీ స్వేచ్చావతి అమ్మవారు.

శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం గ్రామదేవత శ్రీ స్వేచ్ఛావతి అమ్మవారు ఎంతో మహిమాన్వితమైన స్వయంభూ దేవతగా ప్రసిద్ధి చెందారు

ఆంధ్ర రాష్ట్రంలో శ్రీకాకుళం జిల్లా లోగల ఇచ్చాపురం అనే గ్రామానికి ఓ ప్రత్యేక గుర్తింపు ఉంది.రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీ అధ్యక్షుడైనా మొదట ఇచ్చాపురం నుండే తన రాజకీయ అరంగేట్రం చేయడం మనందరం చూస్తూనే ఉన్నాం. అయితే రాష్ట్రానికి శివారున ఉన్న ఇచ్చాపురం అనే గ్రామానికి అంత విశిష్టత ఎందుకు అన్నది ఇప్పుడు మనం తెలుసుకుందాం.

శ్వేచ్చావతి అమ్మవారి ప్రత్యేకత:  పూర్వం 14వ శతాబ్దంలో దట్టమైన అడవులతో ఉన్న ఈ ప్రాంతంలో ఓ శక్తి స్వరూపిణి భూమి అంతర్భాగం నుండి స్వయంభూ గా వెలసిందని,ఓ తాంత్రిక శక్తి స్వరూపిణిగా భావించి శ్వేచ్చావతి అమ్మవారిగా కొలుస్తూ ఆప్రాంత రాజు ఓ గుడి కట్టి నిత్యం పూజలు చేసేవారని, కాలక్రమేణా స్థానికులు ఓ ప్రత్యేక ఆలయాన్ని నిర్మించినట్లు పురాణాలు చెపుతున్నాయి.

శ్వేచ్చావతి అమ్మవారు ఉగ్రరూపంతో వెలసినప్పటికీ భక్తుల కోర్కెలు తీర్చే కొంగుబంగారం, మంగళప్రదాయిని అంటూ ఆప్రాంత ప్రజలే కాకుండా ఆంధ్ర,ఒడిశా రాష్ట్రాలకు చెందిన ప్రజలకు ప్రగాఢ విశ్వాసం.

శ్రీకాకుళం జిల్లా కేంద్రం నుండి సుమారు 130 కిలోమీటర్ల దూరంలో ఆంధ్ర ఒడిశా సరిహద్దు ప్రాంతంలో వెలసిన శ్వేచ్చావతి అమ్మవారిని కొలిచి ఏపని ప్రారంభించినా విజయం తధ్యమన్నది పలు సందర్భాలే మనకు నిదర్శనమని చెప్పకతప్పదు.

సంబరాలు: నిత్యం రోజుకు 3 సార్లు పూజలందుకుంటూనే,వైశాఖ,జ్యాష్ట మాసాలలో ఈ ప్రాంతంలో సంబరాల రూపంలో ప్రత్యేకంగా ఉత్సవాలు జరుగుతుంటాయి.ఈ ఉత్సవాలకు సుదూర ప్రాంతాల నుండి భక్తులు తండోపతండాలుగా చేరుకుని శ్వేచ్చావతి అమ్మవారిని దర్శించుకుని పునీతులవుతుంటారు.

ఇచ్చాపురం  నామకరణం: శ్వేచ్చావతి అమ్మవారు ఈప్రాంతంలో వెలయడం వలనే ఈప్రాంతానికి ఇచ్చాపురం అనే నామకరణం జరిగిందని స్థానికులు చెపుతున్నారు.ఇచ్చా అంటే కోరిక స్వయంగా తనకుతానుగా భూమి నుండి వెలసిన దేవత కారణంగానే ఈప్రాంతానికి ఇచ్చాపురం అనే పేరు వచ్చిందని వారు చెపుతున్నారు.

RELATED ARTICLES

Most Popular