Homeఆంధ్రప్రదేశ్తిరుమలలో హనుమజ్జయంతి వేడుకలు.

తిరుమలలో హనుమజ్జయంతి వేడుకలు.

TIRUPATHI : వైశాఖ మాసం బహుళదశమినాడు తిరుమల క్షేత్రంలో ఘనంగా నిర్వహించే హనుమజ్జయంతి వేడుకలు, ఈ ఏడాది కూడా టీటీడీ అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు.

తిరుమల, 2026 మే 12: ప్రతి సంవత్సరం వైశాఖ మాసం బహుళదశమినాడు తిరుమల క్షేత్రంలో ఘనంగా నిర్వహించే హనుమజ్జయంతి వేడుకలు ఈ ఏడాది కూడా టీటీడీ అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు.

శ్రీవారి ఆలయానికి ఎదురుగానున్న శ్రీ బేడి ఆంజనేయస్వామివారికి, కాలినడకబాటలో ఏడవ మైలు వద్ద ఉన్న శ్రీప్రసన్న ఆంజనేయస్వామి వారికి హనుమజ్జయంతినాడు ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి.

తిరుమలలోని జాపాలి తీర్థంలో కూడా హనుమజ్జయంతి ప్రతి సంవత్సరం ఘనంగా నిర్వహించబడుతుంది. అలాగే ఈ ఏడాది కూడా టీటీడీ అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు.

ఈ సంద‌ర్భంగా సాంప్రదాయానుసారం టీటీడీ త‌ర‌పున శ్రీ జ‌పాలి హ‌నుమాన్ కు ప‌ట్టు వ‌స్త్రాలు స‌మ‌ర్పించ‌నున్నారు.

కాగా మొదటి ఘాట్‌రోడ్డులోని ఏడవమైలు వద్ద ఉన్న శ్రీ ప్రసన్న ఆంజనేయస్వామి నిలువెత్తు విగ్రహానికి అదే రోజు సాయంత్రం 3 గంటలకు ప్రత్యేక పూజా కార్యక్రమాలను టీటీడీ నిర్వహిస్తుంది. ఈ నేపథ్యంలో ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు భక్తులు, స్థానికుల సౌకర్యార్థం తిరుమల నుండి ఏడో మైలుకు, తిరిగి తిరుమల చేరడానికి టీటీడీ ఉచిత రవాణా సౌకర్యాన్ని కూడా కల్పిస్తుంది.

RELATED ARTICLES

Most Popular