Homeఆంధ్రప్రదేశ్APTIDCO–PMAY(U) లబ్ధిదారులకు రూ.4.17 కోట్ల చెక్కుల పంపిణీ

APTIDCO–PMAY(U) లబ్ధిదారులకు రూ.4.17 కోట్ల చెక్కుల పంపిణీ

PALASA: APTIDCO–PMAY(U) లబ్ధిదారులకు రూ.4.17 కోట్ల చెక్కుల పంపిణీ.

APTIDCO–PMAY(U) లబ్ధిదారులకు రూ.4.17 కోట్ల చెక్కుల పంపిణీ

పలాస-కాశీబుగ్గ పురపాలక సంఘ పరిధిలో APTIDCO–PMAY(U) పథకం కింద 300 చదరపు అడుగులు, 365 చదరపు అడుగులు మరియు 430 చదరపు అడుగుల గృహాల కోసం దరఖాస్తు చేసుకుని, సంబంధిత మొత్తాలను డిమాండ్ డ్రాఫ్టుల రూపంలో చెల్లించినప్పటికీ గృహాలు మంజూరు కాకపోయిన లబ్ధిదారులకు ప్రభుత్వం చెల్లించిన మొత్తాలను తిరిగి అందజేసే కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది.

ఈ సందర్భంగా పలాస శాసనసభ సభ్యురాలు శ్రీమతి గౌతు శిరీష చేతుల మీదుగా 1,149 మంది లబ్ధిదారులకు మొత్తం రూ.4,17,40,000/- విలువైన చెక్కులను పంపిణీ చేశారు. గృహాలు మంజూరు కాకపోయిన కారణంగా లబ్ధిదారులు చెల్లించిన డిమాండ్ డ్రాఫ్టులు, మున్సిపల్ రసీదులు మరియు ఇతర సంబంధిత పత్రాలను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి అర్హులైన వారి వివరాలను ప్రభుత్వానికి సమర్పించగా, ప్రభుత్వం వారి చెల్లింపులను తిరిగి చెల్లించేందుకు ఆమోదం తెలిపింది.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గౌతు శిరీష మాట్లాడుతూ, ప్రజల కష్టార్జిత ధనం వారికి తిరిగి చేరేలా ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుందని అన్నారు. ప్రజల సమస్యల పరిష్కారమే ప్రభుత్వ లక్ష్యమని, అర్హులైన ప్రతి ఒక్కరికీ న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. గతంలో గృహాల కోసం ఆశతో చెల్లింపులు చేసిన లబ్ధిదారులకు ఈ చెక్కుల పంపిణీ ద్వారా ఉపశమనం లభిస్తుందని తెలిపారు.

కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, ప్రజలకు సంబంధించిన ప్రతి అంశాన్ని బాధ్యతాయుతంగా పరిష్కరిస్తోందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ప్రభుత్వం కట్టుబడి ఉందని, భవిష్యత్తులో కూడా ప్రజా ప్రయోజనాల కోసం నిరంతరం కృషి చేస్తామని ఆమె అన్నారు.

ఈ కార్యక్రమంలో ఏపీటిపిసి చైర్మన్ వజ్జ బాబురావు, ఏఎంసీ చైర్మన్ మల్ల శ్రీనివాస్ , గ్రంధాలయ చైర్మన్ పీరికట్ల విఠల్ , బీసీ సెల్ అధ్యక్షులు లోడగల కామేష్, గాలి కృష్ణారావు, చిన్ని గురుటి సూర్యనారాయణ, కోరికాను శంకర్ ఇతర నాయకులు,మున్సిపల్ అధికారులు, , కూటమి నాయకులు, వార్డు సభ్యులు, సంబంధిత శాఖల అధికారులు మరియు పెద్ద సంఖ్యలో లబ్ధిదారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular