Homeఆంధ్రప్రదేశ్ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అడ్మిషన్ ఫీజు రద్దు చేయాలి.

ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అడ్మిషన్ ఫీజు రద్దు చేయాలి.

PALASA: ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అడ్మిషన్ ఫీజు రద్దు చేయాలి.

ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అడ్మిషన్ ఫీజు రద్దు చేయాలి.

Palasa: శ్రీకాకుళం జిల్లా పలాస జూనియర్ కాలేజ్ వద్ద AISF, PDSU విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అడ్మిషన్ ఫీజు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన కార్యక్రమం చేపట్టారు.

ఈ సందర్భంగా PDSU రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం వినోద్ కుమార్, AISF జిల్లా ప్రధాన కార్యదర్శి సిహెచ్ రవికుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న జూనియర్ కళాశాలలో పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులు విద్య అభ్యసిస్తున్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం పేద విద్యార్థుల దగ్గర అడ్మిషన్ ఫీజు పేరుతో వసూలు చేయడం సరికాదన్నారు.

2000 నుండి 3000 వరకు అడ్మిషన్ ఫీజు కట్టలేక చాలామంది డ్రాపోర్ట్స్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉందన్నారు. తక్షణమే ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అడ్మిషన్ ఫీజు రద్దుచేసి ఇప్పటికే వసూలు చేసిన అడ్మిషన్ ఫీజును తిరిగి విద్యార్థులకు చెల్లించాలని డిమాండ్ చేశారు.

విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్పందించి తక్షణమే తగు చర్యలు తీసుకోవాలని అన్నారు. లేనిపక్షంలో రాష్ట్ర వ్యాప్త ఉద్యమాలకు స్వీకారం చుడతామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు సాయికుమార్ పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular