డెడికేటెడ్ కమిషన్” చైర్ పర్సన్ రాజీవ్ రంజన్ మిశ్రా తో బి సీ కార్పొరేషన్ డైరెక్టర్ డాక్టర్ దుర్గా రావు. ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల కోసం వెనుకబడిన తరగతుల రిజర్వేషన్లను నిర్ణయించేందుకు, సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం ప్రభుత్వం విశ్రాంత ఐఏఎస్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్రా నేతృత్వంలో ఏకసభ్య డెడికేటెడ్ కమిషన్ను నియమించింది.
ఈరోజు ఏకసభ్య డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా గారిని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర.రజక సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్ డాక్టర్ వేగులాడ దుర్గా రావు కలిసి రాజకీయంగా వెనుకబడిన కులాలకు ప్రాధాన్యత కల్పిస్తూ అవకాశం కల్పించాలని కోరడం జరిగినది. ప్రజాస్వామ్యంలో సామాజిక న్యాయం (Social Justice), బీసీలకు (BCs) కేటాయించిన రిజర్వేషన్లలో, ఇప్పటివరకు రాజకీయ అవకాశాలు దక్కని అత్యంత వెనుకబడిన కులాలకు ‘సబ్-కోటా’ (Sub-quota) కల్పించాలని, వెనుకబడిన వర్గాలలోనే ఉన్న అంతర్గత అసమానతలను గుర్తించి, నిజంగా అట్టడుగున ఉన్న కులాలకు మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని విజ్ఞప్తి చేశాను.
సర్పంచులు, ఎంపీపీలు, పురపాలక సంఘ చైర్మన్, ఎమ్మెల్యేలు, మరియు ఇతర కీలక పదవులలో వెనుకబడిన తరగతులకు తగినంత ప్రాతినిధ్యం కల్పించడం ద్వారానే నిజమైన ప్రజాస్వామ్యం సాధ్యమవుతుందని కోరడం జరిగినది.
