Homeఆంధ్రప్రదేశ్సంక్షేమ హాస్టల్ విద్యార్థుల మెస్ చార్జీలును పెంచాలి.

సంక్షేమ హాస్టల్ విద్యార్థుల మెస్ చార్జీలును పెంచాలి.

PALASA: సంక్షేమ హాస్టల్ విద్యార్థుల మెస్ చార్జీలును పెంచాలి.

సంక్షేమ హాస్టల్ విద్యార్థుల మెస్ చార్జీలును పెంచాలి.

పి డి ఎస్ యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.వినోద్

పలాస:   సంక్షేమ హాస్టల్ విద్యార్థుల మెస్ చార్జీలను పెంచాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం( పి డి ఎస్ యు) ఆధ్వర్యంలో గురువారం పలాస ఆర్డిఓ గారికి వినతి పత్రం అందజేశారు. సందర్భంగా పి డి ఎస్ యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం. వినోద్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా సంక్షేమ హాస్టల లో ఉండి లక్షలాదిమంది ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు చదువుతున్నారు. గత మూడు సంవత్సరాలుగా సంక్షేమ హాస్టల్ విద్యార్థుల మెస్ చార్జీలను ప్రభుత్వాలు పెంచడం లేదు.

రాష్ట్రంలో నిత్యవసర వస్తువు ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. మూడు, నాలుగు తరగతి విద్యార్థులకు 1150 రూపాయలు, ఐదు నుండి 10వ తరగతి వరకు 1400 రూపాయలు, ఇంటర్ డిగ్రీ విద్యార్థులకు 1600 రూపాయలు మెస్ ఛార్జీలు ప్రభుత్వం ఇస్తుంది. ఈ మెస్ చార్జీలతో విద్యార్థులకు ఆరోగ్యవంతమైన ఆహారం అందడం అసంభవం.

ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం 10% పెంచుతామని ప్రకటన చేసింది. కానీ ఇవి సరిపోవు 49% మెస్ చార్జీలును పెంచాలి. పెరిగిన ధరలకు అనుగుణంగా నెలకు 3000 రూపాయలకు హాస్టల్ విద్యార్థుల మెస్ చార్జీలు పెంచాలి. అదేవిధంగా పెండింగ్ లో ఉన్నటువంటి కాస్మోటిక్ చార్జీలను తక్షణమే విడుదల చేయాలి.

గిరిజన పోస్ట్ మెట్రిక్ హాస్టల్స్ లో రెగ్యులర్ వర్కర్లను నియమించాలి. సంక్షేమ హాస్టల్ లలో ఖాళీగా ఉన్న అన్ని రకాల పోస్టులు భర్తీ చేయాలని, సొంత భవనాలు నిర్మించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పి డి ఎస్ యు నాయకులు విజయ్, దయ ,చంటి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular