మందస మండలం పాతకోటలో పిడుగుపాటు ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది.
పిడుగుపాటుకు గురై ఇద్దరు మహిళలు మృతి చెందారు.
మృతులను **పెడంగో, పాతకోటకు చెందిన కే. సోముద్రి (44), సవర జోర (45)**గా గుర్తించారు.
ఈ ఘటనలో మరో ఐదుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి.
గాయపడిన వారిని బుయ బరిణి, కుమార్ నీలవతి, కాట సుస్మిత, మద్య దేవకిగా గుర్తించారు. మరో వ్యక్తి పేరు తెలియాల్సి ఉంది.
తీవ్రంగా గాయపడిన వారిని చికిత్స కోసం హరిపురం సీహెచ్‌సీకి తరలించారు.
పిడుగుపాటు ఘటనతో పాతకోటతో పాటు పరిసర గ్రామాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.
