Homeఆంధ్రప్రదేశ్పలాస సమీపంలో బాదం చెట్టుకు వేలాడుతూ గుర్తుతెలియని యువకుడి మృతదేహం.

పలాస సమీపంలో బాదం చెట్టుకు వేలాడుతూ గుర్తుతెలియని యువకుడి మృతదేహం.

PALASA: పలాస సమీపంలో బాదం చెట్టుకు వేలాడుతూ గుర్తుతెలియని యువకుడి మృతదేహం.

పలాస సమీపంలో బాదం చెట్టుకు వేలాడుతూ గుర్తుతెలియని యువకుడి మృతదేహం.

శ్రీకాకుళం జిల్లా పలాస మండలం సుమ్మాదేవి–కొబ్బరి చెట్లూరు గేటు మధ్య జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న బాదం చెట్టుకు ఓ గుర్తుతెలియని యువకుడు ఉరివేసుకున్న స్థితిలో మృతదేహం వేలాడుతూ కనిపించడం శుక్రవారం ఉదయం కలకలం రేపింది.

స్థానికులు గమనించి వెంటనే కాశీబుగ్గ పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసిన కాశీబుగ్గ పోలీసులు మృతుడి వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తూ అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular