Homeఆంధ్రప్రదేశ్రైతు సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయం.

రైతు సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయం.

PUNDI: పలాస శాసనసభ్యురాలు శ్రీమతి గౌతు శిరీష  ప్రత్యేక చొరవతో నియోజవర్గం రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సకాలంలో యూరియా అందించడం జరిగిందని తెలిపారు.

రైతు సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయం – కర్ని రమణ

PUNDI : పలాస శాసనసభ్యురాలు శ్రీమతి గౌతు శిరీష  ఆదేశాల మేరకు వజ్రపుకొత్తూరు మండలం,  గోవిందపురం గ్రామంలో రైతు సేవా కేంద్రంలో రైతులకు యూరియా పంపిణీ కార్యక్రమాన్ని వజ్రపుకొత్తూరు మండల టీడీపీ ప్రధాన కార్యదర్శి కర్ని రమణ  ప్రారంభించి రైతులకు యూరియాను అందజేశారు.

ఈ సందర్భంగా కర్ని రమణ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి దూరదృష్టి పాలనలో రైతు సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యం కల్పిస్తున్నారని, రైతులకు అవసరమైన సమయంలో విత్తనాలు, ఎరువులు, సాగునీరు అందేలా ప్రభుత్వం సమగ్ర కార్యాచరణతో ముందుకు సాగుతోందన్నారు.

పలాస శాసనసభ్యురాలు శ్రీమతి గౌతు శిరీష  ప్రత్యేక చొరవతో నియోజవర్గం రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సకాలంలో యూరియా అందించడం జరిగిందని తెలిపారు.

ఈ యూరియా పంపిణీ కార్యక్రమాన్ని పూర్తిగా పారదర్శకంగా నిర్వహిస్తున్నామని, ఎలాంటి అవినీతికి తావు లేకుండా ప్రతి రైతు ఆధార్‌ను ధృవీకరించిన అనంతరమే యూరియా పంపిణీ చేస్తున్నామని కర్ని రమణ వెల్లడించారు. అర్హులైన ప్రతి రైతుకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం యూరియా అందేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.

రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తోందని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా అవసరమైన సమయంలో సాగునీరు, విత్తనాలు, ఎరువులు అందిస్తూ వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేస్తోందన్నారు. రైతుల అభివృద్ధే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, రైతు సంతోషమే రాష్ట్ర అభివృద్ధికి బాట అని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు జోగారావు, చంద్రయ్య, మోహనరావు, నాగు, కామేష్, సత్యం, వ్యవసాయ శాఖ సిబ్బంది, రైతు సేవా కేంద్రం సిబ్బంది, సహకార సంఘం (సొసైటీ) సభ్యులు, మండల అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular