అంపురం స్మశానానికి కొత్త విద్యుత్ లైన్.
KANCHILI : కంచిలి మండలం అంపురం పంచాయతీ పరిధిలోని అంపురం గ్రామ స్మశానానికి కొత్తగా విద్యుత్ లైన్ ను కూటమి నేతల ఆధ్వర్యంలో శనివారం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే బెందళం అశోక్ ఆదేశాలు, టీడీపీ మండల అధ్యక్షుడు మాదిన రామారావు సహకారంతో విద్యుత్ లైన్ పనులు పూర్తి చేశారు.
ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు మాదిన రామారావు, కార్యదర్శి పైల రామారావు మాట్లాడుతూ, గ్రామాల్లో కనీస వసతుల కల్పనే లక్ష్యంగా పని చేస్తున్నామని తెలిపారు. స్మశానానికి లైట్ సౌకర్యం లేక ప్రజలు ఇబ్బంది పడుతుండడంతో ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి వెంటనే పరిష్కరించామన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు జీ క్రిష్ణరావు, ఏ కూర్మారావు, ఎం పోల్లయ్య, జీ త్రినాధ్, పాపయ్య, జీ దండాసి, జీ శ్రీను, జీ చింతయ్య, దుర్గారావు, బీ చంద్రయ్య, గ్రామ పెద్దలు, గ్రామస్తులు పాల్గొన్నారు.
