రేఖాదేవిపురంలో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన.
KANCHILI : కంచిలి మండలం రేఖాదేవిపురం గ్రామంలో శుక్రవారం 140 మీటర్ల సీసీ రోడ్డు పనులకు కూటమి శ్రేణుల ఆధ్వర్యంలో శంకుస్థాపన చేశారు. టీడీపీ కంచిలి మండల అధ్యక్షుడు మాదిన రామారావు చేతుల మీదుగా శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా మాదిన రామారావు మాట్లాడుతూ, గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అన్నారు. రహదారుల అభివృద్ధితో ప్రజలకు రాకపోకలకు సౌకర్యంగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐటీడీపీ కంచిలి మండల అధ్యక్షుడు వాసాల రమేష్ రెడ్డి, కంచిలి మండల యువత అధ్యక్షుడు ఆనంద్, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి హరిబాబు, గ్రామ ప్రజలు పెద్దఎత్తున పాల్గొన్నారు.
