“ప్రైవేట్ బడులకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు”
KAVITI : ప్రభుత్వ పాఠశాలల్లోనూ ప్రైవేట్ బడులకు ధీటుగా విద్యాబోధన సాగుతోందని కవిటి మండలం బీ గొనపపుట్టుగ ఉన్నత పాఠశాల హెచ్ఎం కే వీరభద్రరావు అన్నారు. శుక్రవారం పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో మకరంపురానికి చెందిన ఏఆర్ కానిస్టేబుల్ తమరాల వేణుబాబు ఆర్థిక సహాయంతో విద్యార్థులకు డైరీలను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఇంచార్జ్ హెచ్ఎం బాబురావు మాట్లాడుతూ, ప్రతి విద్యార్థి డైరీ సహాయంతో హోంవర్క్ రాసుకోవడంతో పాటు ఉపాధ్యాయులు చెప్పే ముఖ్య విషయాలను నోట్ చేసుకుని ఉన్నత విద్యను అభ్యసించాలని సూచించారు. పాఠశాల అభివృద్ధికి సహకరిస్తున్న దాతలను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో మాజీ విద్యా కమిటీ చైర్మన్ సామల సర్వేశ్వరరావు, గ్రామ పెద్ద బెందాళం కృష్ణారావు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
