Homeఆంధ్రప్రదేశ్పూండిలో చైన్ స్నాచర్లు హల్ చల్.

పూండిలో చైన్ స్నాచర్లు హల్ చల్.

PUNDI: పూండి బస్టాండ్ పి.ఎం.పురం రహదారిలో నివాసముంటున్న వృద్ధురాలు కోట లక్ష్మీ ఇంటి ముందున్న పూల చెట్టు పూలు ఏరుతున్న సమయంలో మెడలోని మూడు తులాల బంగారం గొలుసు ఎత్తుకుపోగా,  శుక్రవారం మద్యాహ్నాం సమయంలో దున్న జగదీశ్వరి బాతురూం నుంచి బయటకు వచ్చేసమయంలో ఆమె మెడలోని 55 గ్రాములు సుమారు 4.50 తులాలు రెండు పేకలతో ఉన్న బంగారం పూసల తాడును దోచుకుని పోయారు. 

పూండిలో చైన్ స్నాచర్లు హల్ చల్.

PUNDI : పూండి బస్టాండ్ లో చైన్ స్నాచర్లు హల్ చల్ చేసారు.  రెండు రోజులుగా పూండీనే టార్గెట్ చేసుకుని రెచ్చిపోతున్నారు. ఎవరూ లేని సమయంలో దుండగులు మహిళలు, వృద్ధులపై లక్ష్యంగా చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్నారు.

బాదిత వృద్ధురాలు కోట లక్ష్మి

పూండిలో గురువారం సాయంత్రం, శుక్రవారం మద్యాహ్నం జరిగిన సంఘటనలే ఇందుకు నీదర్శనం. పూండి బస్టాండ్ పి.ఎం.పురం రహదారిలో నివాసముంటున్న వృద్ధురాలు కోట లక్ష్మీ ఇంటి ముందున్న పూల చెట్టు పూలు ఏరుతున్న సమయంలో మెడలోని మూడు తులాల బంగారం గొలుసు ఎత్తుకుపోగా,  శుక్రవారం మద్యాహ్నాం సమయంలో దున్న జగదీశ్వరి బాతురూం నుంచి బయటకు వచ్చేసమయంలో ఆమె మెడలోని 55 గ్రాములు సుమారు 4.50 తులాలు రెండు పేకలతో ఉన్న బంగారం పూసల తాడును దోచుకుని పోయారు.

బాదితులు కధనం మేరకు  పూండి- పీఎంపురం రోడ్డులో నివాసం ఉంటున్న కోట లక్ష్మీ గురువారం సాయంత్రం 4 గంటల సమయంలో ఇంటి ముందు ఉన్న పూల చెట్టు నుంచి పూలు కోస్తున్న సమయంలో వెనుక నుంచి వచ్చిన దుండగులు ఆమె మెడలోని 3 తులాల బంగారు చైను లాక్కొని ఆమెను పూల చెట్టుపైకి నెట్టేసాడు. ఆమె తేరుకునే లోగా దుండగుడు మాయమైట్లు బాదితురాలు ఆవేధన వ్యక్తం చేసింది.

సంఘటన స్థలం వద్ద చోరీ జరిగిన తీరును వివరిస్తున్న దున్న జగదీశ్వరి

పూండి కర్రెమ్మ వీధిలో నివాసముంటున్న దున్న జగదీశ్వరి బాతరూంకి వెల్లి బయటకు వచ్చే సమయంలో వెనుక నుంచి వచ్చిన దుండగులు ఆమెను తలపట్టుకుని నెట్టేసి అపస్మాకర స్తితిలోకి వెళ్లాక మెడలోని 55 గ్రాముల రెండు పేకల బంగారం పుస్తెల తాడును దోచుకెళ్లారు. అదేసమయంలో జగదీశ్వరి కుమార్తె పోన్ చేసినా ఆమె లిఫ్ట్ చేయకపోవడంతో అనుమానం వచ్చి తండ్రి దున్న రవికుమార్ కు ఫోన్ చేసింది. ఆయన ఇంటికి వచ్చి చూసే సరికి బాత్రూం వద్ద ఆమె స్పృహ కోల్పోయి ఉండటాన్ని గమనించారు. ఎంత లేపినా ఆమె స్పృహలోకి రాలేదు. కొంత సేపటి ఆమె తేరుకుని భర్తకు విషయం చెప్పింది.

వెనుక నుంచి ఎవరో తలపై కొట్టడంతో కింద పడిపోయానంది.  ఆ తరువాత తనకు ఏం జరిగిందో తెలియదని ఆమె చెప్పడంతో కుటుంబ సభ్యులంతా ఆందోళనకు గురైయ్యారు. చుట్టుపక్కల గాలించినా దుండగులు ఆచూకి దొరకలేదు.

దున్న రవికుమార్, జగదీశ్వరి కుటుంబానికి పూండి బస్టాండ్ రోడ్డులో బంగారం షాపు, ఫ్రూట్, పాన్ షాపు ఉన్నాయి. ఆ వ్యాపారంలో నిత్యం బిజీగా ఉంటారు. ఐతే గత ఏడాది జనవరి 23న రవికుమార్కు చెందిన బంగారం షాపులోనే సుమారు  లక్షలులో విలువైన వెండి బంగారం నగలు చోరికీ గురైయ్యాయి. ఇంకా ఆ చోరీ కేసు తేలనే లేదు. ఆ సొత్తు రికవరీ కాకపోగా మళ్లీ సంఘటన జరగడంతో వారు కన్నీరు మున్నీరై ఆవేధన వ్యక్తం చేస్తున్నారు.

వజ్రపుకొత్తూరు ఎస్ఐ బి. నిహార్ బాదితుల ఇల్ల వద్దకు వెల్లి పరిసర ప్రాంతాల్లోని సీసీ టీవీ పుటేజీలను పరిశీలించారు. ఆనవాల్లు కోసం సిబ్బంది పరిసర ప్రాంతాలను క్షున్నంగా తనిఖీ చేసారు. కానీ ఎక్కడా ఆధారాలు లభించలేదు. దుండగులు రికారు అయిన సీసీ టీవీ పుటేజీలో కనిపించక పోవవడం వెనుక పోలీసులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అసలు నిజంగా దొంగలు వచ్చారా లేకా.. తెలిసిన వారి పనై ఉంటుందా అన్న కోణంలో సైతం దార్యప్తు చేస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular