Homeఆంధ్రప్రదేశ్పి డి ఎస్ యు రాష్ట్రస్థాయి విద్యా, వైజ్ఞానిక శిక్షణ తరగతులు జయప్రదం చేయండి.

పి డి ఎస్ యు రాష్ట్రస్థాయి విద్యా, వైజ్ఞానిక శిక్షణ తరగతులు జయప్రదం చేయండి.

PALASA: పి డి ఎస్ యు రాష్ట్రస్థాయి విద్యా, వైజ్ఞానిక శిక్షణ తరగతులు జయప్రదం చేయండి.

పి డి ఎస్ యు రాష్ట్రస్థాయి విద్యా, వైజ్ఞానిక శిక్షణ తరగతులు జయప్రదం చేయండి.

Palasa: ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం( PDSU) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా, వైజ్ఞానిక శిక్షణ తరగతులు జులై 10 ,11 తేదీలలో శ్రీకాకుళం జిల్లా పలాస, కాశీబుగ్గలో టీకేఆర్ కళ్యాణ మండపంలో జరగనున్నాయి. ఈ శిక్షణా తరగతులను జయప్రదం చేయాలని పి డి ఎస్ యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.వినోద్ కుమార్ పిలుపునిచ్చారు.

శనివారం సూది కొండ కాలనీ పి డి యస్ యు కార్యాలయంలో నిర్వహించిన పత్రిక విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అంతర్జాతీయంగా, జాతీయంగా వస్తున్నటువంటి మార్పులు అదే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యా రంగంలో అవలంబిస్తున్నటువంటి విధానాలపై ఈ శిక్షణా తరగతులు ఉంటాయని అన్నారు.

కేంద్రంలో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 12 సంవత్సరాలు అవుతుంది.  ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని ఆనాడు హామీ ఇచ్చారు. కానీ నేడు ప్రభుత్వ రంగ సంస్థల కార్పొరేట్ సంస్థలకు తాకట్టు పెడుతున్నారు. దేశంలో నిరుద్యోగ సమస్య రోజురోజుకు పెరిగి పోతుంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తవుతుంది.  రాష్ట్రవ్యాప్తo గా బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు ఉన్నత విద్యను దూరం చేసే జీవో నెంబర్ 77 నేటికీ రద్దు చేయలేదు.

రాష్ట్రవ్యాప్తంగా 10400 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు పెండింగ్ లో ఉన్నాయి. రాష్ట్రంలో విశ్వవిద్యాలయాలు నేడు సమస్యలకు నిలయాలుగా ఉన్నాయి. విశ్వవిద్యాలయాల అభివృద్ధికి అధిక నిధులు కేటాయించాలి. రేషనలైజేషన్ పేరు గిరిజన ఆశ్రమ పాఠశాలలను కుదించడం తగదని అన్నారు. విద్యారంగా అభివృద్ధికి అధిక నిధులు కేటాయించాలని పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్ కాస్మోటిక్ చార్జీలను 3000 రూపాయలకు పెంచాలని ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థల్లో ఫీజుల నియంత్రణ చట్టం అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి రాజు, నాయకులు శంకర్, దయానంద్, పాల్గొనరావు,భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular