గణేష్ ఉత్సవాల నిర్వహణకు ముఖ్య సూచనలు
కాశీబుగ్గ ఉప విభాగ పోలీసు కార్యాలయం
➢ గణేష్ ఉత్సవాల నిర్వహణకు ఆన్లైన్ అనుమతులు తప్పనిసరి.
➢ మండపాలు, పందిళ్ల ఏర్పాటుకు పోలీసుల అనుమతి అవసరం లేదు.
➢ గణేష్ మండపాలు, పందిళ్ల ఏర్పాటుకు ఆన్లైన్లో దరఖాస్తు – ఒకే వేదికపై అన్ని శాఖల సమన్వయంతో అనుమతులు.
క్రింద తెలిపిన విధంగా గణేష్ ఉత్సవాల నిర్వహణకు సంబంధించి నిర్వాహకులు, ప్రజలు తప్పనిసరిగా పాటించాల్సిన సూచనలు:
గణేష్ మండపాలు, పందిళ్ల ఏర్పాటుకు నిర్వాహకులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. గణేష్ ఉత్సవాల నిర్వహణకు సంబంధించి పోలీస్ శాఖ, రెవెన్యూ శాఖ, విద్యుత్ శాఖ, మున్సిపల్ శాఖ తదితర శాఖల అనుమతులు అవసరమైన సందర్భంలో ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
గణేష్ మండపాలు, పందిళ్ల ఏర్పాటుకు అనుమతుల కోసం https://ganeshutsav.net/ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుదారులు మండపానికి సంబంధించిన పూర్తి వివరాలను నమోదు చేయాలి.గణేష్ మండపాలు, పందిళ్ల ఏర్పాటుకు విద్యుత్ శాఖ, మున్సిపల్ శాఖ తదితర శాఖల నుంచి అవసరమైన అనుమతులు పొందాలి. ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందుగానే సంబంధిత శాఖల అనుమతులు పొందడం మంచిది.గణేష్ ఉత్సవాల సమయంలో శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా నిర్వాహకులు పోలీస్ శాఖకు సహకరించాలి. ప్రజలకు, వాహనదారులకు ఇబ్బంది కలిగే విధంగా రహదారులను ఆక్రమించి మండపాలు ఏర్పాటు చేయరాదు.
🟠 ఆన్లైన్ అనుమతుల కోసం సమర్పించాల్సిన వివరాలు
🔹 మండపం నిర్వహించే వ్యక్తి/నిర్వాహకుల పేరు, చిరునామా, ఫోన్ నంబర్.
🔹 మండపం ఏర్పాటు చేసే ప్ర విగ్రహం ఏర్పాటు చేయనున్న గణేష్ విగ్రహం ఎత్తు, బరువు వివరాలు.
🔹 మండపం ఏర్పాటు చేసే ప్రదేశం వివరాలు.
🔹 ఉత్సవాల నిర్వహణకు సంబంధించిన పూర్తి వివరాలు.
🔹 గణేష్ నిమజ్జనం నిర్వహించే తేదీ, సమయం.
🔹 అవసరమైతే పోలీస్ శాఖ, రెవెన్యూ శాఖ, మున్సిపల్ శాఖ తదితర శాఖల అనుమతులు పొందాలి.
🔹 మండపం కోసం ఏర్పాటు చేయబోయే విద్యుత్ సౌకర్యం వివరాలు.
🟢 మండపాల వద్ద పాటించాల్సిన సూచనలు
🔹 ప్రతి గణేష్ మండపం వద్ద భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని భద్రతా చర్యలు చేపట్టాలి.
🔹 రహదారులకు, ప్రజలకు, వాహనాల రాకపోకలకు ఎటువంటి అంతరాయం కలగకుండా మండపాలను ఏర్పాటు చేయాలి.
🔹 మండపాల వద్ద శబ్ద కాలుష్యం జరగకుండా నిబంధనలకు అనుగుణంగా మైక్‌లు, లౌడ్స్పీకర్లు ఉపయోగించాలి.
🔹 విగ్రహం సమీపంలో హాజరయ్యే భక్తులకు అవసరమైన భద్రతా ఏర్పాట్లు చేయాలి.
🔹 అత్యవసర పరిస్థితుల్లో పోలీసులకు సమాచారం అందించాలి.
🔹 విగ్రహం వద్ద మద్యం, ఇతర మత్తు పదార్థాలు వినియోగించకుండా చూడాలి.
🔊 శబ్ద కాలుష్యంపై ప్రత్యేక సూచనలు
🔹 అంతరాయం కలిగించే విధంగా లౌడ్స్పీకర్లు, సౌండ్ సిస్టమ్‌లు ఉపయోగించరాదు.
🔹 రాత్రి 10.00 గంటల నుంచి ఉదయం 6.00 గంటల వరకు మైక్‌లు/లౌడ్స్పీకర్లు వినియోగించరాదు.
🔹 నిబంధనలకు విరుద్ధంగా శబ్ద కాలుష్యం చేస్తే చర్యలు తీసుకోబడతాయి.
🔹 నిబంధనలను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలి.
🛕 విగ్రహాలు, అగ్నిప్రమాదాల నివారణకు జాగ్రత్తలు
🔹 విగ్రహాల వద్ద, మండపాల వద్ద అగ్నిప్రమాదాలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
🔹 విగ్రహం సమీపంలో ప్రమాదకరమైన విద్యుత్ తీగలు ఉండకుండా చూడాలి.
🔹 మండపాల వద్ద మంటలు, పటాకులు తదితర వాటిని జాగ్రత్తగా ఉపయోగించాలి.
🔹 అత్యవసర పరిస్థితుల్లో వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలి.
🚨 నిమజ్జన భద్రత
🔹 విగ్రహాల నిమజ్జనం చేసే సమయంలో నిర్వాహకులు తగిన భద్రతా చర్యలు తీసుకోవాలి.
🔹 నిమజ్జనం చేసే ప్రదేశంలో ప్రజలు, భక్తుల రద్దీని నియంత్రించాలి.
🔹 చిన్నపిల్లలు, వృద్ధులు మరియు ఈత రాని వ్యక్తులు నీటిలోకి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
🔹 నిమజ్జనం సమయంలో పోలీస్ శాఖ సూచనలను తప్పనిసరిగా పాటించాలి.
🚙 వాహనాల రాకపోకలు మరియు ట్రాఫిక్
🔹 గణేష్ నిమజ్జనం సందర్భంగా ట్రాఫిక్‌కు ఎలాంటి అంతరాయం కలగకుండా నిర్వాహకులు సహకరించాలి.
🔹 అత్యవసర వాహనాలైన అంబులెన్స్, ఫైర్ సర్వీస్ వాహనాలకు రహదారులపై వాహనాలను
ఇష్టానుసారంగా నిలిపివేయరాదు.
🔹 నిమజ్జనం సందర్భంగా అవసరమైన చోట ట్రాఫిక్ మళ్లింపులు పాటించాలి.
🔹 పోలీసు అధికారులు సూచించిన మార్గాల్లోనే వాహనాలు ప్రయాణించాలి.
🔹 అత్యవసర వాహనాలైన అంబులెన్స్, ఫైర్ సర్వీస్ వాహనాలకు ఎటువంటి అంతరాయం కలగకుండా చూడాలి.
🚫 డీజేలు, మ్యూజిక్ సిస్టమ్‌ల వినియోగం
🔹 గణేష్ మండపాల వద్ద డీజేలు, అధిక శబ్దంతో కూడిన మ్యూజిక్ సిస్టమ్‌లు వినియోగించరాదు.
🔹 అధిక శబ్దం వల్ల ప్రజలకు ఇబ్బంది కలిగితే నిర్వాహకులపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి.
🔹 ఎలాంటి అల్లర్లు, ఘర్షణలకు తావులేకుండా ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి.
🪪 బాలబాలికల భద్రత
🔹 పిల్లలను ఒంటరిగా మండపాలు, నిమజ్జన ప్రాంతాలకు పంపించకూడదు.
🔹 గణేష్ మండపాల వద్ద పిల్లల భద్రతకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి.
🔹 పిల్లలు తప్పిపోయిన సందర్భంలో వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలి.
🔹 డయల్ 112 ద్వారా పోలీసులను సంప్రదించవచ్చు.
వాట్సాప్: 6309990933
🛒 హాకర్స్/వ్యాపారుల విషయంలో జాగ్రత్తలు
🔹 గణేష్ మండపాల పరిసర ప్రాంతాల్లో అనధికారంగా షాపులు, స్టాల్స్ ఏర్పాటు చేయరాదు.
🔹 ప్రజల రాకపోకలకు ఇబ్బంది కలిగే విధంగా వ్యాపార కార్యకలాపాలు నిర్వహించరాదు.
🔹 ట్రాఫిక్‌కు అంతరాయం కలిగే విధంగా రహదారులపై వ్యాపారాలు నిర్వహించకుండా చూడాలి.
👮 పోలీసులకు సహకరించాలి
🔹 ప్రతి గణేష్ మండపం వద్ద నిర్వాహకులు పోలీసులకు సహకరించాలి.
🔹 అనుమానాస్పద శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించరాదు.
🔹 అనుమానాస్పద వ్యక్తులు లేదా వస్తువులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలి.
🔹 ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలి.
🙏 ప్రజలకు విజ్ఞప్తి:
గణేష్ ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, ప్రశాంతంగా, పరస్పర సహకారంతో నిర్వహించాలి. ప్రజల భద్రత, శాంతిభద్రతలకు ప్రాధాన్యత ఇస్తూ పోలీసు శాఖ సూచనలు మరియు ప్రభుత్వ నిబంధనలను ప్రతి ఒక్కరూ పాటించాలి.
గణేష్ ఉత్సవాల నిర్వహణకు సంబంధించి మరిన్ని వివరాలు మరియు ఆన్లైన్ అనుమతుల కోసం https://ganeshutsav.net/ / https://ganeshutsav.net/application వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.
సబ్-డివిజినల్ పోలీస్ ఆఫీసర్,
కాశీబుగ్గ సబ్-డివిజన్
