Homeఆంధ్రప్రదేశ్బాలయ్య జన్మదిన వేడుకలు.

బాలయ్య జన్మదిన వేడుకలు.

PALASA : పలాస-కాశీబుగ్గ లో నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకలను అభిమానులు ఘనంగా నిర్వహించారు.

పలాస లో ఘనంగా బాలయ్య జన్మదిన వేడుకలు.

PALASA : శ్రీకాకుళం జిల్లా పలాస-కాశీబుగ్గ లో నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకలను అభిమానులు ఘనంగా నిర్వహించారు.

పలాస నందమూరి బాలకృష్ణ అభిమానసంఘ అధ్యక్షుడు తాలభద్ర.బాబూరావు ఆధ్వర్యంలో జరిగిన ఈవేడుకల్లో పెద్దఎత్తున అభిమానులు పాల్గొన్నారు.ఈసందర్భంగా అభిమానుల మధ్య కేక్ కట్ చేసి తమ అభిమాన నటుడికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

జన్మదిన వేడుకల్లో టిడిపి నాయకుడు APTC చైర్మన్ వజ్జ బాబురావు హాజరై బాలకృష్ణ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసారు. జై బాలయ్య అంటూ అభిమానుల నినాదాలతో ఆప్రాంతం పండగవాతావరణం నెలకొనగా,పేదలకు అన్న సంతర్పణ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమంలో అభిమానులు మరియు టిడిపి కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular