కుంకుమ సాగరం ఫీడర్ కాలువ కబ్జాలు తొలగిస్తాం.
PALASA : పలాస కాశీబుగ్గలో కుంకుమ సాగరం కాలువలో అక్రమంగా మట్టిని పూడ్చివేసి, అక్రమ కట్టడాలు నిర్మించారు. అక్కడ జరిగిన కబ్జాను, అక్రమ కట్టడాలును పలాస కాశీబుగ్గ మునిసిపల్ కమీషనర్ శ్రీనివాస రావు, మైనర్ ఇరిగేషన్ ఏఈ శ్రీనివాసరావు తో కలిసి పరిశీలించడం జరిగింది. కొండల పైనుంచి ప్రవహించే నీరు కాలువ ద్వారా కుంకుమ సాగరానికి చేరుతుంది.
ఈ కాలువ గత ప్రభుత్వంలో కబ్జాకు గురైంది. ఆక్రమణల కారణంగా కాలువ ఎక్కడుందో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. జలధార కార్యక్రమంలో భాగంగా కాలువలో ఆక్రమణలు గుర్తించి వాటిని తొలగించడానికి మరియు కాలువలలో పేరుకుపోయిన ముళ్ల పొదలు, చెత్తను జంగిల్ క్లియరెన్స్ ద్వారా శుభ్రం చేయడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని ఇరిగేషన్ ఏఈ శ్రీనివాసరావు చెప్పారు.

ఈ పనులన్నింటినీ నిర్దేశిత గడువులోగా పూర్తి చేసి నీటి వనరులకు పూర్వ వైభవం తేవాలని దుర్గా రావు కోరారు. మున్సిపాలిటీ అనుమతి లేకుండా అక్రమంగా నిర్మించిన కట్టడాలకు నోటీసులు పంపించి తొలగిస్తామని మున్సిపల్ కమిషనర్ తెలిపారు. ఈకార్యక్రమంలో మున్సిపల్ జనసేన పార్టీ నాయకులు , అధికారులు పాల్గొన్నారు.
