Homeఆంధ్రప్రదేశ్విత్తన గులికలతో ప్రకృతి వ్యవసాయానికి ఊతం

విత్తన గులికలతో ప్రకృతి వ్యవసాయానికి ఊతం

SOMPETA : విత్తన గులికలతో ప్రకృతి వ్యవసాయానికి ఊతం.

విత్తన గులికలతో ప్రకృతి వ్యవసాయానికి ఊతం.

జాడుపూడిలో రైతులకు అవగాహన.

క్షేత్రస్థాయిలో ప్రదర్శన నిర్వహణ.

SOMPETA : సోంపేట డివిజన్ కంచిలి మండలం జాడుపూడి పంచాయతీ పరిధిలోని జాడుపూడి గ్రామంలో ప్రకృతి వ్యవసాయ విధానాల ప్రోత్సాహంలో భాగంగా రైతులకు విత్తన గులికల (సీడ్ బాల్స్) తయారీ, వినియోగంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రకృతి వ్యవసాయ సిబ్బంది, ఐసీఆర్‌పీలు రైతుల సమక్షంలో విత్తన గులికలను తయారు చేసి, కాంపాక్ట్ బ్లాక్ పరిధిలోని రైతులు పిలక మోహన్, పిలక పున్నయ్య, గేదెల జగ్గారావు, పిలక నిరంజన్, పిలక చలమయ్యల కొబ్బరి, జీడిమామిడి తోటల్లో లైన్ సోయింగ్ పద్ధతిలో విత్తన గులికలను నాటించి ప్రదర్శన చేపట్టారు.

ఈ సందర్భంగా ఐసీఆర్‌పీలు మాట్లాడుతూ, విత్తన గులికల విధానం ద్వారా సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదైన పరిస్థితుల్లో కూడా విత్తనాల మొలకశాతం మెరుగ్గా ఉంటుందని వివరించారు. ఎండాకాలంలో భూమిలో నిక్షేపంగా ఉండే ఈ గులికలు వర్షాలు కురిసిన వెంటనే మొలకెత్తి పంటల పెరుగుదలకు దోహదపడతాయని తెలిపారు. అంతేకాకుండా విత్తనాలను చీడపీడల ప్రభావం నుంచి రక్షించడంలో, భూమిలోని సూక్ష్మజీవులను సంరక్షించడంలో, నేల తేమశాతాన్ని నిలుపుకోవడంలో ఈ విధానం కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు.

తక్కువ వర్షపాతం పరిస్థితుల్లో కూడా రైతులకు ప్రత్యామ్నాయ ఆదాయం లభించే అవకాశాలు పెరుగుతాయని, భూమి నిరంతరం పచ్చని పంటలతో కప్పబడి ఉండటంతో జీవవైవిధ్యం అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. ప్రకృతి వ్యవసాయ పద్ధతులు రైతులకు తక్కువ వ్యయంతో మెరుగైన ఫలితాలను అందిస్తాయని వివరించారు.కార్యక్రమంలో గ్రామ పెద్దలు, రైతులు, లీడ్ ఫార్మర్లు, అంపురం యూనిట్ ఐసీఆర్‌పీలు శ్రీదేవి, రేవతి, విజయలక్ష్మి, శాంతి, రోజా, జయలక్ష్మి, బీఆర్‌సీ ఓనర్ పూర్ణ వాసులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular