విశ్రాంత హెచ్ఎం పూడి నీలాచలం మృతి
పరామర్శించిన ఎమ్మెల్సీ, జెడ్పీ చైర్పర్సన్
KAVITI : కవిటి మండలంలోని ప్రగడపుట్టుగకు చెందిన విద్యావేత్త, తెలుగు పండిట్, విశ్రాంత ప్రధానోపాధ్యాయుడు పూడి నీలాచలం (81) ఆదివారం కన్నుమూశారు. కొంతకాలంగా వృద్ధాప్య సంబంధిత అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన, ఆరోగ్యం మరింత క్షీణించడంతో తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయనకు భార్య, కుమారుడు ఉన్నారు.
నీలాచలం మాస్టారు మృతి విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్సీ నర్తు రామారావు, జెడ్పీ చైర్పర్సన్ పిరియా విజయ, మండల కన్వీనర్ కడియాల ప్రకాష్, మరియు పెద్దలు, ప్రజా ప్రతినిధులు, నాయకులు నీలాచలం మాస్టారు కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించారు.
