Homeఆంధ్రప్రదేశ్దేవరపద్ర అప్పలస్వామి కుటుంబానికి పరామర్శ

దేవరపద్ర అప్పలస్వామి కుటుంబానికి పరామర్శ

KANCHILI : దేవరపద్ర అప్పలస్వామి కుటుంబానికి పరామర్శ.

దేవరపద్ర అప్పలస్వామి కుటుంబానికి పరామర్శ

మృతిపై సంతాపం తెలిపిన బుడ్డెపు కామేష్ రెడ్డి

కంచిలి మండలం రేఖాదేవిపురం గ్రామానికి చెందిన దేవరపద్ర అప్పలస్వామి (45) ఆకస్మికంగా మృతిచెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ విషయం తెలుసుకున్న ఎంటీఎస్ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుడ్డెపు కామేష్ రెడ్డి సోమవారం గ్రామానికి చేరుకుని మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించారు.

ఈ సందర్భంగా అప్పలస్వామి మృతి పట్ల ప్రగాఢ సంతాపం వ్యక్తం చేసిన కామేష్ రెడ్డి, కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ఈ కష్ట సమయంలో కుటుంబానికి అండగా ఉంటామని భరోసా కల్పించారు.  ఈ పరామర్శలో ఆయనతో పాటు గ్రామ పెద్దలు, స్థానిక నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular