Homeఆంధ్రప్రదేశ్గంజాయి పట్టివేత.

గంజాయి పట్టివేత.

KANCHILI : కంచిలిలో శుక్రవారం ఉదయం పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారు.

కంచిలిలో రూ.1.5 లక్షల గంజాయి పట్టివేత – ఒడిశా యువకుడు అరెస్టు.

KANCHILI : కంచిలిలో శుక్రవారం ఉదయం పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. కంచిలి పోలీస్ స్టేషన్ పరిధిలోని బీటీ రోడ్డు, రైల్వే పార్క్ ఎదురుగా తనిఖీలు నిర్వహిస్తుండగా ఒడిశాకు చెందిన యువకుడి వద్ద 3.370 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సుమారు రూ. 1,50,000 ఉంటుందని పోలీసులు తెలిపారు. కంచిలి పోలీస్ స్టేషన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో సీఐ మంగరాజు, ఎస్సై పారినాయుడు ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించి పలు విషయాలు వెల్లడించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఒడిశా రాష్ట్రం, ఝార్సుగూడ జిల్లా, లాఖన్‌పూర్‌కు చెందిన అభినవ్ సింగ్ (24) గంజాయి తరలిస్తుండగా అతన్ని అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. నిందితుడి వద్ద నుంచి నలుపు బ్యాక్‌ప్యాక్‌లో ఉన్న గంజాయితో పాటు మొబైల్ ఫోన్, ఆధార్ కార్డు జిరాక్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడిని విచారించగా మరో వ్యక్తి సుమన్ అలియాస్ సుమన్ బిస్వాస్ ప్రమేయం ఉన్నట్లు తేలిందని, అతను పరారీలో ఉన్నట్లు సీ.ఐ., ఎస్ఐ తెలిపారు.

నిందితుడిని కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ, మత్తు పదార్థాలతో యువత భవిష్యత్తు నాశనం అవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. గంజాయి విక్రయించడం, వాడటం చట్టరీత్యా నేరమని, కఠిన శిక్షలు ఉంటాయని హెచ్చరించారు. ప్రజలు తమ పరిసరాల్లో గంజాయి అమ్మకాలు, వినియోగం గురించి సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని పోలీస్ అధికారి కోరారు.

RELATED ARTICLES

Most Popular