Homeఆంధ్రప్రదేశ్జూన్ 12 నుంచి 15 లక్షల కొత్త పెన్షన్లు: కూటమి ప్రభుత్వం.

జూన్ 12 నుంచి 15 లక్షల కొత్త పెన్షన్లు: కూటమి ప్రభుత్వం.

KANCHILI : జూన్ 12 నుంచి 15 లక్షల కొత్త పెన్షన్లు: కూటమి ప్రభుత్వం.

కర్తలిలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ
జూన్ 12 నుంచి 15 లక్షల కొత్త పెన్షన్లు: కూటమి ప్రభుత్వం

కంచిలి మండలం కొల్లూరు పంచాయతీ పరిధిలోని కర్తలి గ్రామంలో సోమవారం ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న పలు సంక్షేమ పథకాలతో ప్రజలు సంతోషంగా ఉన్నారని స్థానిక నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా ఐటీడీపీ కంచిలి మండల అధ్యక్షుడు వాసాల రమేష్ రెడ్డి మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని అన్నారు.

జూన్ 12వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా వితంతు, దివ్యాంగ, వృద్ధాప్య పెన్షన్లు కలిపి సుమారు 15 లక్షల మందికి పెన్షన్లు అందజేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించిందని వివరించారు. పెన్షన్‌తో పాటు ఇతర సంక్షేమ పథకాలు అందుతుండటంతో లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం పథకాలు అమలు చేస్తుండటం పట్ల గ్రామస్థులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఫెసిలిటేటర్ పార్వతి ధర్మారెడ్డి, పెన్షన్ లబ్ధిదారులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular