Homeఆంధ్రప్రదేశ్కాలం మారిన… స్నేహం మారలేదు.

కాలం మారిన… స్నేహం మారలేదు.

KAVITI : కవిటి మండలం జగతి గ్రామంలో 1995-96 విద్యా సంవత్సరంలో 10వ తరగతి చదివిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం హర్షాతిరేకాల మధ్య ఘనంగా నిర్వహించారు.

KAVITI : 30 ఏళ్ల తర్వాత కలిసిన జగతి పూర్వ విద్యార్థులు,  ఆనాటి జ్ఞాపకాలతో ఆత్మీయ సమ్మేళనం.

కవిటి మండలం జగతి గ్రామంలో 1995-96 విద్యా సంవత్సరంలో 10వ తరగతి చదివిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం హర్షాతిరేకాల మధ్య ఘనంగా నిర్వహించారు.   మూడు దశాబ్దాల అనంతరం ఒకే వేదికపై కలుసుకున్న సహపాఠులు ఆనాటి పాఠశాల జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు.
చదువుకునే రోజుల్లో కలిసి గడిపిన మధుర క్షణాలు,  తరగతి గదుల్లో చేసిన అల్లరి,  ఉపాధ్యాయుల మందలింపులు,  ఆటపాటలు,  పాఠశాల వార్షికోత్సవాలు, పరీక్షల అనుభవాలు ఒక్కొక్కటిగా గుర్తుచేసుకుంటూ పూర్వ విద్యార్థులు సందడి చేశారు.

ఎంతోకాలం  తర్వాత  స్నేహితులను  ప్రత్యక్షంగా  కలుసుకోవడంతో  కార్యక్రమ  ప్రాంగణం  ఆప్యాయ  పలకరింపులు,  నవ్వులతో  కళకళలాడింది.
ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ   పాఠశాల దశలో ఏర్పడిన స్నేహబంధాలు జీవితాంతం గుర్తుండిపోతాయని పేర్కొన్నారు.   ప్రస్తుతం వివిధ రంగాల్లో స్థిరపడినప్పటికీ,  విద్యార్థి దశలోని అనుబంధం మాత్రం ఎప్పటికీ చెదరలేదని తెలిపారు.  తమ ఎదుగుదలకు పునాది వేసిన గురువులను స్మరించుకుంటూ కృతజ్ఞతలు తెలియజేశారు.

కార్యక్రమంలో కొందరు ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించి వారి సేవలను కొనియాడారు.   అనంతరం పూర్వ విద్యార్థులు కలిసి జ్ఞాపికగా ఫొటోలు దిగుతూ ఆనందాన్ని పంచుకున్నారు.   భవిష్యత్తులో కూడా ప్రతి సంవత్సరం ఇలాంటి సమ్మేళనాలు నిర్వహిస్తూ పరస్పర అనుబంధాన్ని కొనసాగించాలని నిర్ణయించారు.
ఆనందం, ఆత్మీయత, భావోద్వేగాల మేళవింపుగా సాగిన ఈ పూర్వ విద్యార్థుల సమ్మేళనం జగతి గ్రామంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

RELATED ARTICLES

Most Popular